మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100 కాన్వాస్ vs ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ (ఏది బెస్ట్..?)

ఈ ఏడాదికిగాను 5 నుంచి 7 అంగుళాల స్ర్కీన్ సామర్ద్యం కలిగిన పెద్దస్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో విడుదలయ్యాయి. ఇండియన్ మార్కెట్ విషయానికొస్తే 5 అంగుళాల స్ర్కీన్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ ఏర్పడింది. సామ్‌సంగ్ నుంచి గెలాక్సీ నోట్2 విడుదలైన కొద్ది రోజుల్లోనే మైక్రోమ్యాక్స్ అలానే ఎల్‌జీలు రెండు ఉత్తమశ్రేణి ఫాబ్లెట్‌లను అందుబాటులోకి తెచ్చాయి. మైక్రోమ్యాక్స్ నుంచి 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో విడుదలైన ‘ఏ100 కాన్వాస్’ మార్కెట్ ధర రూ.10,300. మరోవైపు, 5 అంగుళాల స్ర్కీన్ శ్రేణిలో ఎల్‌జీ ప్రవేశపెట్టిన ‘ఆప్టిమస్ వీయూ’ ధర రూ.29,999. ఈ నేపధ్యంలో వీటి స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.......
బరువు ఇంకా చుట్టుకొలత.....
మైక్రోమ్యాక్స్ ఏ100 కాన్వాస్: 72.6x142.2x11.9 మిల్లీ మీటర్లు, బరువు 168గ్రాములు,
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ: చుట్టుకొలత 139.6 x 90.4 x 8.5మిల్లీ మీటర్లు, బరువు 168 గ్రాములు,
డిస్‌ప్లే....
మైక్రోమ్యాక్స్ ఏ100 కాన్వాస్: 5 అంగుళాల హై క్లారిటీ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ: 5 అంగుళాల హై క్లారిటీ ఎక్స్‌జీఏ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్1280 x 768పిక్సల్స్, స్టైలస్ సపోర్ట్,
ప్రాసెసర్...
మైక్రోమ్యాక్స్ ఏ100 కాన్వాస్: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, అనుసంధానించబడిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ: 1.5గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ఎన్-విడియా టెగ్రా3 ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం....
మైక్రోమ్యాక్స్ ఏ100 కాన్వాస్ : ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా.....
మైక్రోమ్యాక్స్ ఏ100 కాన్వాస్ : 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ వీజీఏ కెమెరా,
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
మెమరీ.....
మైక్రోమ్యాక్స్ ఏ100 కాన్వాస్ : 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ: 32జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ.....
మైక్రోమ్యాక్స్ ఏ100 కాన్వాస్ : 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై కనెక్టువిటీ,
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్ 4.0, వై-ఫై 802.11 బి/జి/ఎన్, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0,
బ్యాటరీ......
మైక్రోమ్యాక్స్ ఏ100 కాన్వాస్: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (5గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై),
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ: 2080ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (16.54గంటల టాక్‌టైమ్),
ధరలు......
మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ : రూ.10,300,
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ: రూ.29,999 (ఫ్లిప్‌కార్డ్ డాట్ కామ్),
తీర్పు......
స్పెసిఫికేషన్‌ల పరంగా అంచనా వస్తే మైక్రోమ్యాక్స్ ఏ100 కాన్వాస్ పై ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.


Click it and Unblock the Notifications