మైక్రోమ్యాక్స్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఏ101’?

Posted By: Prashanth

మైక్రోమ్యాక్స్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘ఏ101’?

 

దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ నుంచి మరో ఫాబ్లెట్ రాబోతోంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటలైర్ ఫ్లిప్‌కార్డ్ ఈ డివైజ్‌కు సంబంధించిన వివరాలను తాజాగా తన లిస్టింగ్స్‌లో ఉంచింది. ‘మైక్రోమ్యాక్స్ ఏ101’ మోడల్‌లో లభ్యంకానున్న ఈ పెద్ద స్ర్కీన్ డివైజ్ ధరను రూ.10,299గా సదరు రిటైలర్ పేర్కొంది. ఈ ఫాబ్లెట్ అధికారిక విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే......

5 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

డిస్‌ప్లే రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

2జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

బ్లూటూత్, వై-ఫై, 3జీ,

డ్యూయల్ సిమ్ సపోర్ట్,

2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot