సీక్రెట్‌గా స్ర్కిప్ట్... ఫ్యాన్స్‌కు బ్రేకింగ్ న్యూస్!

Posted By: Super

 సీక్రెట్‌గా స్ర్కిప్ట్... ఫ్యాన్స్‌కు బ్రేకింగ్ న్యూస్!

 

 

ఇండియా ఆధారిత మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్.. స్మార్ట్‌ఫోన్‌ల నిర్మాణ విభాగంలో తనదైన వ్యూహాలను అనుసరిస్తూ సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తోంది. దేశీయంగా హైబ్రీడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో తన స్థానాన్ని మరింతం బలోపేతం చేసేకునేుందుకు ఇప్పటికే కాన్వాస్ ఏ100, ఏ110 కాన్వాస్ 2 (సక్సెసర్) మోడళ్లలో ఫాబ్లెట్‌లను మైక్రోమ్యాక్స్ ప్రవేశపెట్టింది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మరో 5- అంగుళాల ఫాబ్లెట్ డివైజ్ విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ హోమ్ షాప్18(HomeShop18), మైక్రోమ్యాక్స్ విడుదల చేయబోయే ‘ఏ101’ ఆండ్రాయిడ్ 3జీ ఫుల్ టచ్ ఫోన్ వివరాలను తన లిస్టింగ్స్ల్‌లో పేర్కొంది. ఈ హైబ్రీడ్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.9,999గా

హోమ్‌షాప్ ప్రకటించింది. గిజ్‌బాట్‌కు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈ ఫాబ్లెట్ డివైజ్‌ను మైక్రోమ్యాక్స్ వర్గాలు వచ్చేవారం ఆవిష్కరించనున్నాయి.

ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,

3జీ ఆధారిత ఫోన్,

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 480 × 800పిక్సల్స్),

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్),

ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ,

1.2జీబి ఉచిత ఆన్-బోర్డ్ స్టోరేజ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఫోన్ చుట్టుకొలత 148 x 79 x 10.3మిల్లీమీటర్లు,

బరువు 168 గ్రాములు,

లియోన్ 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 6-7గంటలు, స్టాండ్‌బై టైమ్ 350 – 420గంటలు),

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్:

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot