ఆన్‌లైన్ మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్ ‘ఏ105’
ఇండియన్ మొబైల్ ఫోన్ మార్కెట్లో సామ్‌సంగ్ తరువాతి స్థానాన్ని కైవసం చేసుకున్న మైక్రోమాక్స్ మరిన్ని కొత్త ఆవిష్కరణల దిశగా దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్రాండ్ ‘మైక్రోమాక్స్ ఏ105' లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ హోమ్‌షాప్18 రూ.6,999కి ఆఫర్ చేస్తోంది. మైక్రోమాక్స్ ఏ105 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, బ్లూటూత్,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బరువు 180 గ్రాములు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications