మైక్రోమ్యాక్స్ vs కార్బన్ (స్మార్ట్‌ఫోన్ కావాలా.. ఫాబ్లెట్ కావాలా..)

By Super
|

{image-Karbonn-A9+-vs-Micromax-A110-Canvas-2.jpg telugu.gizbot.com}

టాబ్లెట్ పీసీల విక్రయాల్లు దేశీయంగా దూసుకుపోతున్న మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా ఫాబ్లెట్‌ల విక్రయాల్లో మాత్రం వెనుకంజలో ఉంది. తాజాగా మైక్రోమ్యాక్స్ తన కాన్వాస్ ఏ100 ఫాబ్లెట్‌కు సక్సెసర్‌గా ఏ110 కాన్వాస్ 2 పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను మార్కెట్ ముందుకు తేనుంది. ఈ డివైజ్ ధరకు సంబంధించి అధికారిక సమాచారం అందుబాటులో లేనప్పటికి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ మానియాక్ స్టోర్ తన లిస్టింగ్స్‌లో డివైజ్ ప్రీ-ఆర్డర్ ధరను రూ.11,999గా పేర్కొంది. మరో వైపు కార్బన్ మొబైల్స్ ఏ9+పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ టాబ్లట్‌ను బరిలోకి దింపింది. ధర రూ.9,200. ఈ రెండు గ్యాడ్జెట్‌ల ఎంపిక విషయంలో వినియోగదారులకు ఓ అవగాహనను ఏర్పరించేందుకు వీటీ స్పెసిఫికేషన్‌ల మధ్య తులనాత్మక అంచనా.

 

డిస్‌ప్లే:

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 5 అంగుళాల హై క్లారిటీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

 

కార్బన్ ఏ9+: 4 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్:

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

కార్బన్ ఏ9+: 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్, డెడికేటెడ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం:

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్,

కార్బన్ ఏ9+: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్,

కెమెరా:

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 5 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా.

కార్బన్ ఏ9+: 5 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

మెమెరీ:

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కార్బన్ ఏ9+: 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 3జీ, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై,

కార్బన్ ఏ9+: 3జీ, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై,

బ్యాటరీ:

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై),

కార్బన్ ఏ9+: 1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర:

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: రూ.11,999 (ప్రీ-ఆర్డర్ ధర),

కార్బన్ ఏ9+: రూ.9,290.

ప్రీలోడెడ్ ఫీచర్లు:

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: గూగుల్ సెర్చ్, మైక్రోమ్యాక్స్ అప్లికేషన్స్, ఆడోబ్ ఫ్లాష్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఆండ్రాయిడ్ బ్రౌజర్, గేమ్స్, మొబైల్ ట్రాకర్, టార్చ్ లైట్.

కార్బన్ ఏ9+: జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్, గూగుల్ ప్లే, స్కైప్, గూగుల్ టాక్, ఎంఎస్ఎన్, యాహూ మెసెంజర్, ఫ్లిక్కర్, పికాసా, ఫేస్‌బుక్, ట్విట్టర్, యాహూ, వాట్సాప్, ఎకనామిక్ టైమ్స్, టీవోఐ, జస్డ్ డయల్, ఫోన్ సెక్యూరిటీ, కస్టమైజబుల్ హోమ్ స్ర్కీన్, మోషన్ వాల్ పేపర్స్, వాయిస్ నావిగేషన్, గేమ్స్.

తీర్పు:

పెద్దదైన డిస్‌ప్లే, అధిక ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ, మన్నికైన బ్యాటరీ లైఫ్‌ను కోరుకునే వారికి మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2 ఉత్తమ ఎంపిక. వేగవంతమైన ప్రాసెసర్, బెటర్ ఫ్రంట్ కెమెరా, కోరుకునే వారికి కాన్వాస్ ఏ9+ బెస్ట్.

Read in English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X