మైక్రోమాక్స్ నుంచి 16 మెగాపిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్

Posted By:

స్వేదేశంలోనే కాక అంతర్జాతీయ మార్కెట్లోనూ పట్టు సాధించేందుకు శ్రమిస్తున్న మైక్రోమాక్స్ త్వరలో 16 మెగా పిక్సల్ కెమెరా సామర్ధ్యం గల అధిక ముగింపు స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ వివరాలను స్వయంగా అధికారిక మైక్రోమాక్స్ లీక్ స్టర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొనటం జరిగింది. మైక్రోమాక్స్ ఏ350 మోడల్ లో రూపుదిద్దుకున్న ఈ అధికముగింపు హ్యాండ్ సెట్ 5 అంగుళాల హైడెఫినషన్ డిస్ ప్లే వ్యవస్థను కలిగి ఉండనుంది.

మైక్రోమాక్స్ నుంచి 16 మెగాపిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్

అలాగే, 1.7 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీ ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (కిట్ కాట్ అప్‌డేట్‌తో), కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మార్కెట్ ధర రూ.19,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుంది. జనవరి 15నాటికి మైక్రోమాక్స్ ఏ350ని మార్కెట్లో విడుదల చేసే అవకాశముంది. టాటా డొకోమో ఈ ఫోన్ కొనుగోలు పై ప్రత్యేకమైన ఆఫర్‌ను అందించనుంది.

మైక్రోమాక్స్ ఏ350 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్
కిట్‌కాట్),
1.7 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot