దూసుకుపోతున్న ‘ఫైర్ బ్రాండ్’

Posted By: Staff

దూసుకుపోతున్న ‘ఫైర్ బ్రాండ్’

 

 

దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ వరుస ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో తన సూపర్ ఫోన్ నింజా సిరీస్ నుంచి మరో సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. పేరు ‘మైక్రోమ్యాక్స్ ఏ87 సూపర్‌ఫోన్ నింజా 4’(Micromax A87 Superfone Ninja 4). ధర రూ.5,999. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందిస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సౌలభ్యతను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా లోపంచినప్పటికి వెనుక భాగంలో 2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా క్వాలిటీతో కూడిన ఫోటోగ్రఫీని అందిస్తుంది. మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత ఇతర ఫీచర్లు.....

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 × 480పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెర్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

3జీ కనెక్టువిటీ(HSDPA 7.2Mbps; HSUPA 5.76 Mbps),

వై-ఫై 802.11 బి/జి, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, బ్లూటూత్ 2.1,

1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కలర్ వేరియంట్స్: బ్లాక్ ఇంకా వైట్,

మైక్రోమ్యాక్స్ ఏ84 సూపర్‌ఫోన్ ఎలైట్!

దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘ఏ84 సూపర్ ఫోన్ ఎలైట్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.9999. ఆకట్టకునే ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ డివైజ్ పెట్టుబడికి పూర్తి విలువను చేకూరుస్తుంది. ఫీచర్లు: ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.97 అంగుళాల ఐపీఎస్ wvga డిస్‌ప్లే (రిసల్యూషన్ 800X400),1గిగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,బ్లూటూత్ వర్షన్ 2.1, వై-పై, 3జీ, యూఎస్బీ కనెక్టువిటీ, అయిషా వాయిస్ కమాండ్ అప్లికేషన్, జీపీఎస్, 1630ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 5 గంటలు, స్టాండ్ బై 160 గంటలు), ఎక్సప్యాండబుల్ మెమెరీ 32జీబి. ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్లో Aisha అనే వాయిస్ కమాండ్ అప్లికేషన్‌ను నిక్షిప్తం చేశారు. సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్ తరహాలో రూపుదిద్దుకున్న ఈ ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్ లాంటి ఫీలింగ్‌ను చేరువచేస్తుంది.

Read in English:

అయిషా వాయిస్ కమాండ్ అప్లికేషన్ ప్రత్యేకత:

Aisha అంటే ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్పీచ్ హ్యాండ్‌సెట్ అసిస్టెంట్’. ఈ అప్లేకేషన్.. పదాలను చర్యలలోకి అనువదించగలదు. అంటే నోటీ ద్వారా మీరు ఇచ్చే కమాండ్‌లకు ఈ అప్లికేషన్ ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు: ‘What is the weather in vijayawada’ అని మీరు వాయిస్ కమాండ్ ఇస్తే టక్కన ‘The weather will be hot and humid’అని సమాధానం ఇస్తుంది

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot