మైక్రోమ్యాక్స్ Vs ఇంటెక్స్ (తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ యుద్ధం)

Posted By: Prashanth

మైక్రోమ్యాక్స్ Vs ఇంటెక్స్ (తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ యుద్ధం)

 

దేశీయంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం ఊపందుకుంటున్న నేపధ్యంలో మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, కార్బన్, లావా తదితర దేశవాళీ సంస్థలు తక్కువ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ పై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో లోకల్ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్‌లు తాజాగా సూపర్ ఫోన్ ఏ87 నింజా 4, ఆక్వా 4.0 మోడళ్లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. ఈ బ్రడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ.5,999, రూ.5,490గా ఉండటంతో వీటి మధ్య పోటీ మార్కెట్ నెలకుంది. వీటి ఎంపిక విషయంలో వినియోగదారుకు స్పష్టమైన అవగాహనను ఏర్పరిచే క్రమంలో రెండు గ్యాడ్జెట్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌ల విశ్లేషణ......

బరువు ఇంకా చుట్టుకొలత:

నింజా4: చుట్టుకొలత 124.8 x 64 x 11.7మిల్లీమీటర్లు,

ఆక్వా 4.0: చుట్టుకొలత 115.3 x 61.4 x 11.9మిల్లీమీటర్లు, బరువు 113.2 గ్రాములు,

డిస్‌ప్లే:

నింజా4: 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ఆక్వా 4.0: 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ ( రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),

ప్రాసెసర్:

నింజా 4: 1గిగాహెర్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

ఆక్వా 4.0: 800మెగాహెర్జ్ ప్రాసెసర్,

Read In English

ఆపరేటింగ్ సిస్టం:

నింజా 4: ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

ఆక్వా 4.0: ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

నింజా 4: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ వీడియో కాలింగ్ కెమెరా,

ఆక్వా 4.0: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్:

నింజా4: మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, ఇంటర్నల్ మెమరీ లోపించింది.

ఆక్వా 4.0: 131 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

నింజా 4: వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,

ఆక్వా 4.0: వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,

బ్యాటరీ:

నింజా 4: 1400ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (3 గంటల టాక్‌టైమ్, 140 గంటల స్టాండ్‌బై),

ఆక్వా 4.0: 1400ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 175 గంగల స్టాండ్‌బై),

ధర:

నింజా4: రూ.5,999,

ఆక్వా 4.0: రూ.5,490.

తీర్పు:

ఈ తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టకునే స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉన్నాయి. ఇంటెక్స్ ఆక్వా 4.0లో లోడ్ చేసిన అప్లికేషన్‌లు ఎఫ్ఎమ్ రేడియో, మ్యూజిక్ ప్లేయర్, సౌండ్ రికార్డర్ వంటి ప్రధానంగా ఆకర్షిస్తాయి. అదే సమయంలో మైక్రోమ్యాక్స్ నింజా4లో లోడ్ చేసిన అయిషా వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ ఆపిల్ సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్ తరహాలో కొత్త అనుభూతులకు లోను చేస్తుంది. ధర, ప్రాసెసర్, స్ర్కీన్ సైజ్, కెమెరా, లాంగ్వేజ్ సపోర్ట్, ఇంటర్నల్ మెమరీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే యూజన్ ఇంటెక్స్ ఆక్వా 4.0 వైపు మొగ్గు చూపే అవకాశముంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot