మైక్రోమ్యాక్స్ vs సామ్‌సంగ్!

Posted By: Staff

మైక్రోమ్యాక్స్ vs సామ్‌సంగ్!

 

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లతో  ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కళకళలాడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది అనేక ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. తక్కువ ధర డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టడంలో దేశవాళీ బ్రాండ్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా  ఈ విభాగంలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు చర్చనీయాంశంగా మారాయి. ఒకటి మైక్రోమ్యాక్స్ డిజైన్ చేసిన ఏ87 సూపర్ నింజా 4 కాగా మరొకటి సామ్‌సంగ్ డిజైన్ చేసిన గెలాక్సీ వై డ్యుయోస్ లైట్. వీటి స్పెసిఫికేషన్‌ల మధ్య విశ్లేషణ క్లుప్తంగా...

Read in English:

డిస్‌ప్లే ఇంకా చుట్టుకొలత:

ఏ87 నింజా4: చుట్టుకొలత 124.8 x 64 x 11.7మిల్లీమీటర్లు, 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్.

సామ్‌సంగ్ గెలాక్సీ  వై డ్యుయోస్ లైట్: చుట్టుకొలత 103.5 x 58 x 12మిల్లీమీటర్లు, 2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్

డిస్‌ప్లే, రిసల్యూషన్  240 x 320పిక్సల్స్,

ప్రాసెసర్:

ఏ87 నింజా4: 1గిగాహెర్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.

వై డ్యుయోస్ లైట్: 832మెగాహెర్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

ఏ87 నింజా4: ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

వై డ్యుయోస్ లైట్: ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

ఏ87 నింజా4: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వై డ్యుయోస్ లైట్: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

స్టోరేజ్:

ఏ87 నింజా4:  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

వై డ్యుయోస్ లైట్: 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

ఏ87 నింజా4:  మైక్రోయూఎస్బీ 2.0, వై-ఫై, 3జీ, బ్లూటూత్,

వై డ్యుయోస్ లైట్:  మైక్రోయూఎస్బీ 2.0, వై-ఫై, 3జీ, బ్లూటూత్,

బ్యాటరీ:

ఏ87 నింజా4: 1400 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

వై డ్యుయోస్ లైట్: 1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర:

ఏ87 నింజా4: రూ.5,999,

వై డ్యుయోస్ లైట్: రూ. 6,990.

తీర్పు:

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో  ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఆధునిక ఫీచర్లు లోపించాయి.  మెమరీ విషయంలో  సామ్‌సంగ్ వై డ్యుయోస్ లైట్ ఉత్తమ ఎంపిక. మైక్రోమ్యాక్స్ ఏ87 నింజా4లో ఇంటర్నల్ స్టోరేజ్ వ్యవస్థ లోపించినప్పటికి

అయిషా వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు ఆకర్షిస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot