100 రోజుల్లోపు ఫోన్ రిపేర్ వస్తే కొత్త ఫోన్

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్, ఇండియన్ యూజర్ల కోసం 100 రోజుల రీప్లేస్‌మెంట్ స్కీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంపిక చేసిన మైక్రోమాక్స్ ఫీచర్ ఫోన్‌ల పై 100 రోజుల రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని మైక్రోమాక్స్ కల్పిస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డేట్ ఆఫ్ యాక్టివేషన్ నాటి నుంచి 100 రోజుల్లోపు

మైక్రోమాక్స్ నుండి ఫోన్‌ను కొనుగోలు చేసిన తరువాత డేట్ ఆఫ్ యాక్టివేషన్ నాటి నుంచి 100 రోజుల్లోపు ఏదైనా రిపేర్ తలెత్తినట్లయితే ఆ ఫోన్‌కు బదులుగా కొత్త ఫోన్‌ను ఇచ్చేస్తారు. ప్రస్తుతానికి X1i, x706, x424, x740, x730, x904, x570, x512, x412, x726* మోడల్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తోంది.

4G VoLTE ఫోన్‌లకు డిమాండ్ మిన్నంటిన నేపధ్యంలో ...

4G VoLTE ఫోన్‌లకు దేశవ్యాప్తంగా డిమాండ్ మిన్నంటిన నేపధ్యంలో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ కారుచౌక ధరల్లో రెండు సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. భారత్ 1, భారత్ 2 మోడల్స్‌లో రాబోతున్న ఈ ఫోన్‌లలో మొదటిది ఫీచర్ ఫోన్ కాగా, రెండవది స్మార్ట్‌ఫోన్.

రూ.1999, రూ.2,999

జావా ఆధారిత ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే భారత్ 1 ఫోన్ ధరను రూ.1999గా మైక్రోమాక్స్ నిర్ణయించింది సమాచారం. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే భారత్ 2 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.2,999గా నిర్ణయించినట్లు సమాచారం. బ్యాంకింగ్ ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్‌లు, మొబైల్ తయారీ కంపెనీల మధ్య మరింత పోటీ పెంచే అవకాశం ఉంది.

6 కోట్ల ఫోన్‌లను విక్రయించాలన్నది మైక్రోమాక్స్ లక్ష్యం

దేశవ్యాప్తంగా 5 నుంచి 6 కోట్ల భారత్ 1, భారత్ 2 ఫోన్‌లను విక్రయించాలన్నది మైక్రోమాక్స్ లక్ష్యంగా తెలుస్తోంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి భారత్ 3 ఫోన్‌ను కూడా రంగంలోకి దింపేందుకు మైక్రోమాక్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax announces 100-day replacement promise on any hardware fault for feature phones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot