మొబైల్‌లో ఏదైనా లోపమా.. ఇంకెందుకు ఆలస్యం కొత్తదానిని తీసుకొండి

Posted By: Staff

మొబైల్‌లో ఏదైనా లోపమా.. ఇంకెందుకు ఆలస్యం కొత్తదానిని తీసుకొండి

ఇండియాలో ఉన్న మొబైల్ తయారీదారి సంస్దలు కేవలం కస్టమర్స్‌కు మొబైల్స్ అమ్మడంతో వారి పని అయినపోయినట్లుగా భావిస్తారు. ఒక్కసారి కస్టమర్‌కు మొబైల్‌ని విక్రయించిన తర్వాత మొబైల్‌తో పాటు ప్రోడక్ట్ కిట్‌కు ఒక సంవత్సరం లేదా 1.5 సంవత్సరాలు వారంటీ ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత మొబైల్‌కి ఏమైన ఇబ్బంది వస్తే మాత్రం వారంటీ ఉన్న లోపే మేము బాగు చేస్తాం. వారంటీ అయిపోతే మాకు సంబందం లేదంటూ చేతులు ఎత్తువేసిన సందర్బాలు చాలా చూశాం. ఐతే ఇటీవల కాలంలో నోకియా ఓ పెద్ద క్యాంపెయిన్‌ నిర్వహించి ఒక రకం బ్యాటరీలను రీకాలా చేసి వాటి స్దానంలో కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా కొత్తవాటిని ఇచ్చిన సంఘటనలు కూడా మనం చూశాం.

ఇప్పుడు సరిగ్గా ఇలాంటి కొవలోకే దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ కూడా చేరనుంది. ఐతే మైక్రోమ్యాక్స్ ప్రవేశపెట్టిన ఆఫర్ ఏంటంటే మొబైల్ కొన్ని ఏడు రోజులలో కస్టమర్స్ ఎవరైనా మొబైల్ హ్యాండ్ సెట్‌లో ఏదైనా లోపాన్ని గనుక గమనించినట్లైతే దాని స్దానంలో మరో కొత్త మొబైల్‌ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ క్యాంపెయిన్‌ని మైక్రోమ్యాక్స్ బిజినెస్ డైరెక్టర్ వికాస్ జైన్ ప్రకటించారు. ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ మైక్రోమ్యాక్స్ కస్టమర్స్‌కి ఎవరికైనా లోపాలున్న హ్యాండ్ సెట్ తిరిగి ఇచ్చి కొత్త హ్యాండ్ సెట్స్‌ని తీసుకొని వెళ్లవచ్చునని అన్నారు.

ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం జనాభాలో మైక్రోమ్యాక్స్ మొబైల్స్ సరైన కస్టమర్ సర్వీస్‌ని అందించడం లేదనే అపోహా ఉండడంతో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ క్యాంపెయిన్ సహాయంతో లొపాలున్న కస్టమర్స్ హ్యాండ్ సెట్స్‌ని ఇచ్చేసి కొత్త హ్యాండ్ సెట్స్‌ని పోందే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. దీనికి గాను మైక్రోమ్యాక్స్ మొబైల్స్ టోల్ ఫ్రీ నెంబర్స్‌ని ప్రకటించడం జరిగింది. ఇలా క్యాంపెయిన్ నిర్విహించడంతో మైక్రోమ్యాక్స్‌కి ఇంకా ఎక్కువగా కస్టమర్స్ పెరిగే అవకాశం ఉందని అన్నారు.

కంప్లైంట్స్ టోల్ ప్రీ నెంబర్: 1860 500 8286.

టెక్నికల్ హెల్ప్ టోల్ ప్రీ నెంబర్: 011 44770000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting