మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఏ110 కాన్వాస్ 2’ ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం!

Posted By: Prashanth

మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఏ110 కాన్వాస్ 2’ ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం!

 

న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఏ110 సూపర్ ఫోన్ కాన్వాస్ 2’ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఔత్సాహికులు ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌‍డీల్ డాట్ కామ్‌లోకి ప్రవేశించి కాన్వాస్ 2ను బుక్ చేసుకోవచ్చు. మైక్రోమ్యాక్స్ ఏ100కు సక్సెసర్‌గా మార్కెట్లోకి రాబోతున్నఏ110 సూపర్ ఫోన్ కాన్వాస్ 2 శక్తివంతమైన 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఐసీఎస్ ప్లాట్‌ఫామ్‌ను లోడ్ చేశారు. 5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్. ధర ఇతర వివరాలకు సంబంధించి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. రెండు నెలలు క్రితం మార్కెట్లో విడుదలైన మైక్రోమ్యాక్స్ ఏ100 ఫీచర్లు......

మైక్రోమ్యాక్స్ ఏ100:

5 అంగుళాల WVGA డిస్‌ప్లే,

2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

5 మెగా పిక్సల్ కెమెరా,

4జీబి ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

ధర అంచనా రూ.9,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot