మైక్రోమాక్స్ నూతన సీఈఓగా వినీత్ తనీజా

|
మైక్రోమాక్స్ నూతన సీఈఓగా వినీత్ తనీజా

సామ్‌సంగ్ ఇండియా ఐటీ, మొబైల్ వ్యాపార విభాగాలకు సీఈఓగా వ్యవహరించి ఇటీవల ఆ పదవి నుంచి వైదొలగిన వినీత్ తనీజా తాజాగా మైక్రోమాక్స్ కంపెనీ సీఈఓగా నియామకమయ్యారు. భారతదేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తమ కంపెనీ నూతన సీఈఓగా వినీత్ తనీజాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్ విలువను రెట్టింపు చేయటంలో వినీత్ తనీజా పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారు. ఆయన ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని మైక్రోమాక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమా‌చారం. వినీత్ తనీజా సారథ్యంలోని మైక్రోమాక్స్ రానున్న కాలంలో ఏ విధమైన రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.

 

లేటెస్ట్‌గా ఉండాలనుకునే వారిక హాటెస్ట్ ఫోన్

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర పరిధిలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం మైక్రోమాక్స్ ‘యూనిటీ 2'(Unite 2) పేరుతో ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.6,999. డివైస్ గురువారం నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. తెలుగు, ఇంగ్లీష్ కాకుండా 19 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మైక్రోమాక్స్ యూనిటీ 2@రూ.6,999! మైక్రోమాక్స్ యూనిటీ 2 ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాలబ్రైట్ గ్రాఫ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్) క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్), 1జీబి ర్యామ్. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గ్రే, గ్రీన్, రెడ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఎమ్ఏడి, గేమ్స్ క్లబ్, హైక్, ఎమ్!గేమ్స్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, ఎమ్!లైవ్, ఒపెరా మినీ, రివీరై ఫోన్‌బుక్, రివీరై స్మార్ట్‌ప్యాడ్, బర్న్ ద రోప్, టాయ్ స్టోరీ స్మాష్‌ఇట్, మార్బుల్ వంటి ఫీచర్లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

 

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X