సామ్‌సంగ్‌ను అధిగమించిన మైక్రోమాక్స్

Posted By:

ఇండియన్ మొబైల్ ఫోన్ మార్కెట్లో సామ్‌సంగ్, నోకియా వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లకు ఆరంభం నుంచి గట్టిపోటీనిస్తోన్న దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ఎట్టకేలకు ఆ రెండు బ్రాండ్‌లను అధిగమించింది. 2014 ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌‍‌కు గాను మైక్రోమాక్స్ దేశీయంగా మార్కెట్ వాటాలో సామ్‌సంగ్‌ను, ఫీచర్ ఫోన్స్ విక్రయాల్లో నోకియాను అధిగమించినట్లు మార్కెట్ రిసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తన నివేదికలో వెల్లడించింది.

సామ్‌సంగ్‌ను అధిగమించిన మైక్రోమాక్స్

దేశీయంగా ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి గాను జరిగిన మొబైల్ విక్రయాల్లో 16.6 శాతం మార్కెట్ వాటాతో మైక్రోమాక్స్ అగ్రస్థానంలో నిలవగా, 14.4 శాతం మార్కెట్ వాటాతో సామ్‌సంగ్ రెండవ స్థానంలో, 10.9 శాతంతో నోకియా మూడవ స్థానంలో నిలిచింది. 9.5 శాతంతో కార్బన్ నాలుగవ స్థానంలో నిలిచింది.

ఫీచర్ ఫోన్‌ల విభాగంలో... మైక్రోమాక్స్ తొలిసారిగా నోకియాను అధిగమించింది. 15.2 శాతం మార్కెట్ వాటాతో మైక్రోమాక్స్ అగ్రస్థానంలో నిలవగా, 4.7శాతం మార్కెట్ వాటాతో నోకియా రెండో స్థానంలో నిలిచింది. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో 19శాతం మార్కెట్ వాటతో మైక్రోమాక్స్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నప్పటికి 25.3 శాతం వాటాతో సామ్‌సంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Micromax beats Samsung, becomes India's No. 1 mobile vendor: Report. Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot