రష్యా మార్కెట్లో కార్యకలాపాలను ప్రారంభించిన మైక్రోమాక్స్

Posted By:

ప్రపంచవ్యాప్తంగా 11వ అతిపెద్ద మొబైల్ తయారీగా అవతరించిన మైక్రోమాక్స్ మొబైల్స్, రష్యన్ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను గురువారం ప్రారంభించింది. ఈ క్రమంలో రష్యాలోని ప్రముఖ పంపిణీ సంస్థలో ఒకటైన వీవీపీ గ్రూప్స్‌తో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ప్రారంభ దశలో భాగంగా మైక్రోమాక్స్ 14 ఉత్పత్తులను రష్యా మార్కెట్లో ప్రవేశపెట్టింది.

రష్యా మార్కెట్లో కార్యకలాపాలను ప్రారంభించిన మైక్రోమాక్స్

ఈ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా 60 ఆపరేషనల్ సర్వీస్ సెంటర్లను నెలకొల్పేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటోంది. 2014 చివరినాటికి రష్యాలోని టాప్ మొబైల్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించేందుకు మైక్రోమాక్స్ కృషి చేస్తోంది. ఇండియన్ మార్కెట్ విషయానికొస్తే మైక్రోమాక్స్ రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. స్మార్ట్‌ఫోన్ + ఫీచర్ ఫోన్‌ల విభాగంలో మూడవస్థానంలో మైక్రోమాక్స్ కొనసాగుతోంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల విభాగంలో అంతర్జాతీయ బ్రాండ్ సామ్‌సంగ్‌తో పోటిపడుతున్న మైక్రోమాక్స్ జనవరి 6న లాస్‌వేగాస్‌లో నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014లో డ్యుయల్ బూటింగ్ సామర్ధ్యం కలిగిన కాన్వాస్ ల్యాప్‌టాబ్‌ను ఆవిష్కరించింది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ ఇంటెల్ ప్రాసెసర్ పై స్సందిస్తుంది. అలానే రెండు ఆపరేటింగ్ సిస్టంల పై బూట్ అవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot