ఆ సంచలన ఫోన్ వచ్చేసింది.. ధర రూ.3,499

మైక్రోమాక్స్ ఎట్టకేలకు తన భారత్ 2 స్మార్ట్‌‌ఫోన్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది. మైక్రోమాక్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో భారత్ 2 స్మార్ట్‌‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు.

ఆ సంచలన ఫోన్ వచ్చేసింది.. ధర రూ.3,499

Read More : 5000 mAh బ్యాటరీతో మోటో ఇ4 ప్లస్, రూ.10,000లోపే?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్కౌంట్ ధర రూ.3,499

ప్రస్తుతానికి ఆఫ్‌లైన్ మార్కెట్లో మాత్రమే ఈ ఫోన్‌లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ధర రూ.3,499. ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. భారత్ 2 స్మార్ట్‌‌ఫోన్‌‌లను ఆన్‌లైన్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ విక్రయించబోతున్నట్లు సమాచారం.

మైక్రోమాక్స్ భారత్ 2 డిజైన్

మైక్రోమాక్స్ భారత్ 2 స్మార్ట్‌‌ఫోన్‌ పాలీకార్బోనేట్ బాడీతో వస్తోంది. లైట్ గోల్డ్ కలర్ ఈ ఫోన్‌కు మరింత లుక్‌ను తీసుకువచ్చింది. ఫోన్‌లో ఫిజికల్ హోమ్ బటన్ ఉండదు. స్ర్కీన్ క్రింది భాగంలో మూడు కెపాసిటివ్ టచ్ బటన్‌లను ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ వెనుక కెమెరా క్రింద మైక్రోమాక్స్ బ్రాండింగ్ ఆకట్టుకుంటుంది.

మైక్రోమాక్స్ భారత్ 2 స్పెసిఫికేషన్స్

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1.3GHz క్వాడ్-కోర్ Spreadtrum SC9832 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా ఫీచర్స్...

మైక్రోమాక్స్ భారత్ 2 స్మార్ట్‌‌ఫోన్‌ 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది.

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

మైక్రోమాక్స్ భారత్ 2 స్మార్ట్‌‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. డ్యుయల్ సిమ్ సపోర్ట్ తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఒక మైక్రోసిమ్‌తో పాటు ఒక రెగ్యులర్ సిమ్ ఉంటుంది. 4g VoLTE, బ్లుటూత్, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ హ్యాండ్‌సెట్‌లో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Bharat 2 with 4G VoLTE announced: Specs, price, features and more. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot