రూ.2,999కే బ్రాండెడ్ 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్

మొబైల్ ఫోన్ మార్కెట్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్న మైక్రోమాక్స్ రూ.2,999కే బ్రాండెడ్ క్వాలిటీ 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

Read More : గెలాక్సీ ఎస్8లోని 8 ఆసక్తికర ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్ 2 Q402

(కాన్సెప్ట్ ఇమేజ్)

భారత్ సిరీస్ నుంచి భారత్ 2 Q402 పేరుతో రాబోతోన్న ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, ఓ ఆన్‌‌లైన్ షాపింగ్ వెబ్‌‌సైట్‌లో 'Coming Soon' ట్యాగ్‌తో లిస్ట్ అయి ఉంది.

భారత్ 2 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్...

4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3Hz క్వాడ్-కోర్ Spreadtrum (SC9832) ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,

భారత్ 2 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్...

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE సపోర్ట్, డ్యుయల్ సిమ్, బ్లుటూత్, వై-ఫై, మైక్రో యూఎస్బీ, యాక్సిలరోమీటర్, 1300mAh రిమూవబుల్ బ్యాటరీ.

త్వరలో మరిన్ని 4జీ వోల్ట్ ఫోన్‌లు

4G VoLTE ఫోన్‌లకు దేశవ్యాప్తంగా డిమాండ్ మిన్నంటిన నేపధ్యంలో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ కారుచౌక ధరల్లో మరిన్ని 4జీ వోల్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

రూ.1999కే భారత్ 1 4జీ వోల్ట్ ఫోన్

భారత్ 1, భారత్ 2 మోడల్స్‌లో రాబోతున్న ఈ ఫోన్‌లలో మొదటిది ఫీచర్ ఫోన్ కాగా, రెండవది స్మార్ట్‌ఫోన్. భారత్ 1 ఫోన్ జావా ఆధారిత ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ధర రూ.1999.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Bharat 2 with VoLTE support set to launch in India at Rs 2,999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot