మైక్రోమాక్స్ Bharat సిరీస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
భారత్ 4, భారత్ 3, భారత్ 2 ప్లస్ పేర్లతో విడుదల కాబోతోన్న ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.
మైక్రోమాక్స్ తన భారత్ సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్‌లకు సంబంధించి పలు కీలక వివరాలను మైక్రోమాక్స్ తన అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా రివీల్ చేసింది. భారత్ 4, భారత్ 3, భారత్ 2 ప్లస్ పేర్లతో విడుదల కాబోతోన్న ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. తెలుగు సహా 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి.

భారత్ 4 స్పెసిఫికేషన్స్..
5 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ ప్రాసెసర్, ర్యామ్ వివరాలు తెలియాల్సి ఉంది, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్యాటరీ వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
భారత్ 3 స్పెసిఫికేషన్స్..
4.5 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్యాటరీ వివరాలు తెలియాల్సి ఉంది.
భారత్ 2 ప్లస్ స్పెసిఫికేషన్స్..
4 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1600mAh బ్యాటరీ.
ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అవుతోన్న ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ క్యాటగిరి క్రిందకు వస్తాయని మైక్రోమాక్స్ చెబుతోంది. ఈ ఫోన్‌లకు సంబంధించి ధర అలానే ఇతర స్పెసిఫికేషన్స్ మరికొద్ది రోజుల్లో రివీల్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications