భారీ బ్యాటరీతో భారత్ 5, డేటా ఆఫర్లతో మార్కెట్లోకి..
దేశ్ కా స్మార్ట్‌ఫోన్ అంటూ మార్కెట్లోకి దూసుకొచ్చిన షియోమికి పోటీగా దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ తన భారత్ 5ను పోటీలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
దేశ్ కా స్మార్ట్‌ఫోన్ అంటూ మార్కెట్లోకి దూసుకొచ్చిన షియోమికి పోటీగా దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ తన భారత్ 5ను పోటీలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ సంధర్భంగా ఈ ఫోన్‌పై పలు డేటా ఆఫర్లను కంపెనీ ప్రకటించింది.

మైక్రోమ్యాక్స్ భారత్ 5 ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్
1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ నౌగాట్
720x1280 పిక్సల్స్ రిజల్యూషన్
1జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
64జీబీదాకా విస్తరించుకునే సదుపాయం
5 మెగాపిక్సెల్ బ్యాంక్ అండ్ ఫ్రంట్ కెమెరాలు విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

అతి పెద్ద హైలెట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ..
కాగా ఈ ఫోన్‌లో అతి పెద్ద హైలెట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. దీని ద్వారా రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

భారత్-సీరీస్లో భారత్ 5 ప్లస్ త్వరలో..
దేశంలో ఆఫ్‌లైన్ రిటైలర్లు ద్వారా కొనుగోలు చేయడానికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. భారత్-సీరీస్లో భారత్ 5 ప్లస్, భారత్ 5 ప్రోతో పాటు మరో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 2018 నాటికి 6 లక్షల యూనిట్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది.

వొడాఫోన్ కస్టమర్లకు..
రెడ్‌మీ5ఏ కీ పోటీగా తీసుకొచ్చిన భారత్ 5 లాంచింగ్ ఆఫర్‌గా వొడాఫోన్ కస్టమర్లకు 5నెలలు 50జీబీ డేటా ఉచితంగా అందిస్తోంది. అంటే 1జీబీ డేటా అందించే ఏదైనా వోడాఫోన్ ప్యాక్‌లో కస్టమర్లకు అదనంగా 10 జీబీ డేటాను 5నెలలపాటు ఉచితంగా అందిస్తుంది.

దేశంలోని 3-4 టైర్ నగరాల్లో..
మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్, చీఫ్ మార్కెటింగ్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ షుబోడిప్ పాల్ మాట్లాడుతూ .. భారత్5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో తరువాత దిశగా భారత్‌ను తీసుకెళతాయని, ఈ క్రమంలో ఇప్పటికీ తీవ్రమైన విద్యుత్తు అంతరాయ సమస్యలను ఎదుర్కొంటున్న దేశంలోని 3-4 టైర్ నగరాల్లో తమ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ డివైస్‌లు కీలకంగా నిలుస్తాయన్నారు.


Click it and Unblock the Notifications








