మైక్రోమాక్స్ బోల్ట్ ఎ065@రూ.3,779
తక్కువ ధర ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేయటంతో తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరుచుకున్న మైక్రోమాక్స్ తాజాగా బోల్ట్ ఎ065 పేరుతో మరో చవక ధర ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Saholic ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌మొబైలింగ్ డివైస్‌ను రూ.3799కి విక్రయిస్తోంది. 4 అంగుళాల తాకేతెరను కలిగి ఉండే మైక్రోమాక్స్ బోల్ట్ ఎ065 స్మార్ట్‌ఫోన్ ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను ఫోన్‌లో అమర్చారు.

మైక్రోమాక్స్ బోల్ట్ ఎ065 కీలక ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6571 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ వై-ఫై, బ్లూటూత్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








