మైక్రోమాక్స్ బోల్ట్ ఏ37@రూ.3,999
దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన బోల్ట్ సిరీస్ నుంచి ‘బోల్ట్ ఏ37' పేరుతో చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.3,999. ఔత్సాహికులు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ హ్యాండ్ సెట్ 3జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం. 320x 480పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 3.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్, 1గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications