ఆన్‌లైన్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ58

Posted By:

గత కొంతకాలంగా మైక్రోమ్యాక్స్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ58' ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ సాహోలిక్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ  హ్యాండ్‌సెట్‌ను రూ.5,499కి ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ కొనుగోలు పై నెలకు రూ.352 చెల్లించే విధంగా ప్రత్యేక ఈఎమ్ఐ స్కీమ్‌ను సాహోలిక్ ఆఫర్ చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ58

ఫోన్ ఫీచర్లు:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియా టెక్ 6572ఎమ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ సపోర్ట్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 2.0, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot