ఆన్‌‍లైన్ విపణిలోకి మైక్రోమాక్స్ బోల్ట్ ఏ61

Posted By:

ఇండియాకు చెందిన ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ బ్రాండ్ మైక్రోమాక్స్ సోమవారం ‘బోల్డ్ ఏ61'పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4,999.

ఆన్‌‍లైన్ విపణిలోకి మైక్రోమాక్స్ బోల్ట్ ఏ61

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ61 కీలక స్పెసిఫికేషన్‌లు:

మైక్రోమాక్స్ నుంచి విడుదలైన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ బోల్ట్ ఏ61, 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 480x800 పిక్సల్స్, 1గిగాహెట్జ్ సామర్ధ్యంతో కూడిన స్ప్రెడ్‌ట్రమ్ ప్రాసెసర్‌ను ఫోన్‌‍లో ఏర్పాటు చేసారు. 256ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ స్పందిస్తుంది.

ఫిక్సుడ్ ఫోకస్ ఆప్షన్‌తో కూడిన 2 మెగా పిక్సల్ కెమెరాను ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసారు. వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు వీజీఏ కెమెరా వ్యవస్థను ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ మరియు డ్యూయల్ స్టాండ్‌బై. ఫోన్ ఇతర కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ.

హైక్, ఒపెరా, స్పుల్, గేమ్ హబ్, కింగ్ సాఫ్ట్ ఆఫీస్, ఎమ్ లైవ్ వంటి అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేయటం జరిగింది. ఫోన్‌లో ఏర్పాటు 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థ 3.55గంటల టాక్‌టైమ్‌తో పాటు 160గంటల స్డాండ్‌బై టైమ్ సామర్ధ్యాలను కలిగి ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot