మైక్రోమాక్స్ బోల్ట్ ఏ66.. 3జీ సపోర్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో వేదికగా బహుళఉపయోగకర ల్యాప్‌టాబ్‌ను ఆవిష్కరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ మైక్రోమాక్స్ తాజాగా ‘బోల్ట్ ఏ66' పేరుతో సరికొత్త చవకధర 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,000. ఔత్సాహికులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ అధికారిక వెబ్‌సైట్ లేదా స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వైబ్‌సైట్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చు.

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ66 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......
4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), 1గిగాహెట్జ్ క్లాగ్ వేగంతో కూడిన స్ప్రెడ్‌టర్న్ ఎస్‌సీ7710జీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ సామర్ధ్యం గల వీజీఏ ఫ్రంట్ కెమెరా, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), బ్లూటూత్, వై-ఫై, 3జీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 116 గంటల స్టాండ్‌బై టైమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








