Bharat-1తో Jio, AIrtel ఫోన్లు గల్లంతే, హైలెట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి
జియో Airtelకి షాకిచ్చిన భారత్ 1, రూ. 97కే నెలంతా అపరిమిత కాల్స్, డేటా..
రిలయన్స్ జియో 4జీ ఫోన్లు పూర్తిగా జనాల చేతుల్లోకి రాకముందే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసి జియోకు భారీ షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ''భారత్-1'' పేరిట 4జీ ఎల్టీఈ ఆధారిత ఫోన్‌ను విడుదల చేసింది. ఇది పూర్తిగా దేశీయంగా తయారైనది కావడం విశేషం. రిలయన్స్ జియో ఫోను కంటే కాస్త అధికంగా.. అంటే రూ.2,200 లకు లభిస్తుంది. ఫీచర్స్ పై ఓలుక్కేయండి.

ఫోన్ ఫీచర్లు..
2.4 అంగుళాల స్క్రీన్
క్వాల్‌కమ్ 205 ప్రాసెసర్
512ఎంబీ ర్యామ్, 4జిబి ఇంటర్నల్ మెమొరీ
2మెగాపిక్సల్ వెనుక కెమెరా
వీజీఏ సెల్ఫీ కెమెరా
4జీ వోల్ట్, డ్యూయల్ సిమ్ సదుపాయం
2000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
22 భారతీయ భాషల సపోర్ట్

లావాదేవీల కోసం ‘భీం'యాప్
భారత్ 1'లో నగదు లావాదేవీల కోసం ‘భీం'యాప్‌ను పొందుపరిచారు. అలాగే లైవ్ టీవీని వీక్షించవచ్చు. పాటలను వినవచ్చు. వీడియోలను చూడవచ్చు.

బ్యాటరీ బ్యాకప్
2000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు. దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.97లో సరికొత్త ప్లాన్
ఈ ఫోనులో బీఎస్ఎన్ఎల్ రూ.97లో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకుంటే,నెల రోజులకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్, కాలింగ్, ఎస్ఎంఎస్, ఉచిత రోమింగ్ తదితరాలన్నీ నెలకు రూ. 97 రీచార్జ్‌తోనే లభిస్తాయి.

ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్న వినియోగదారులను..
ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్న వినియోగదారులను దానికి అనుసంధానించే ఉద్దేశంతోనే బీఎస్ఎన్ఎల్‌తో కలిసి ఈ ఫోన్లను విడుదల చేసినట్టు మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు.

జియోకు ఎదురుదెబ్బే..
జియో ఫోన్ల కోసం జనాలు క్యూ ఇంకా కరిగిపోకముందే బీఎస్ఎన్ఎల్ ఫోన్లు మార్కెట్లోకి రావడం జియోకు ఎదురుదెబ్బేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








