మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ఫోన్స్ క్యూ80, ఏ70

Posted By: Super

మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ఫోన్స్ క్యూ80, ఏ70

ఇండియన్ మార్కెట్లో ఓ ఖచ్చితమైన మార్కెట్ స్దానాన్ని భర్తీ చేసినందుకు మైక్పోమ్యాక్స్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇండియాలో మొత్తం దాదాపు 30 హ్యాండ్ సెట్స్ వరకు మైక్రోమ్యాక్స్ విడుదల చేసింది. హ్యాండ్ సెట్స్‌ని విడుదల చేయడమే కాకుండా వాటికి సంబంధించిన సేల్స్, సర్వీస్ వ్యవహారాలను చాలా చక్కగా చూస్తుంది. మైక్రోమ్యాక్స్ విడుదల చేసినటువంటి మొబైల్స్ అన్ని కూడా మద్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకోని చేసినవే. మొబైల్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ విడుదల చేసినటువంటి రెండు మోడళ్లు ఎలా కోనసాగుతున్నాయో, వాటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఆ రెండు మోడళ్లు మైక్రోమ్యాక్స్ క్యూ80, మైక్రోమ్యాక్స్ ఏ70.

రెండు మొబైల్ ఫోన్స్ కూడా తక్కువ ఖరీదు గల ఫోన్స్. మైక్రోమ్యాక్స్ క్యూ80 విషయానికి వస్తే ఇది జావా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అదే మైక్రోమ్యాక్స్ ఏ70 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. గతంలో వచ్చిన మొబైల్ పోన్స్‌తో పోల్చితే ఈ రెండు కూడా ఫెర్పామెన్స్‌లో ఎటువంటి రాజీ లేదు. స్టయిల్‌లో రెండు మొబైల్స్ కూడా చాలా అందంగా రూపోందించబడినవి. రెండు మొబైల్స్ కూడా మల్టీమీడియో, ఎంటర్టెన్మెంట్ విషయంలో కస్టమర్స్‌కు అసక్తిని కనబర్చే విధంగా ఉంటాయి. అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి.

రెండు మోడళ్లకు కూడా 3.5 mm ఆడియో జాక్ ఉండడంతో పాటు ఎఫ్‌ఎమ్ రేడియో ప్రత్యేకం. మైక్రోమ్యాక్స్ ఏ70లో వెనుక భాగాన ఉన్న కెమెరా 5మెగా ఫిక్సల్‌తోటి మంచి ఫోటోలను తీయగా, ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరా మాత్రం వీడియో కాలింగ్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మైక్రోమ్యాక్స్ క్యూ80లో వెనుక భాగన 3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి, ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కనెక్టివిటీ టెక్నాలజీలు, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అన్నింటిని కూడా రెండు మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి.

మైక్రోమ్యాక్స్ క్యూ80లో ఒక్క వై-పై కనెక్టివిటీ ఫీచర్ మిస్ అయినప్పటికీ, ఇదే ఫీచర్ మైక్రోమ్యాక్స్ ఏ70లో అందుబాటులో ఉంటుంది. ఇక ఖరీదు విషయానికి వస్తే మైక్రోమ్యాక్స్ క్యూ80 కేవలం రూ 4900కాగా అదే మైక్రోమ్యాక్స్ ఏ70 మాత్రం రూ 9000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot