రూ.6999కే మైక్రోమాక్స్ భారీ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్‌

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన Canvas లైనప్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Canvas 1 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రూ.6999కే మైక్రోమాక్స్ భారీ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్‌

ధర రూ.6.999. మాటీ బ్లాక్ ఇంకా క్రోమ్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై సంవత్సరం వారంటీతో పాటు 100 రోజుల రీప్లేస్‌మెంట్ స్కీమ్‌ను కూడా మైక్రోమాక్స్ ఆఫర్ చేస్తోంది. అంటే ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల్లోపు ఏదైనా హార్డ్ వేర్ లోపం తలెత్తినట్లయితే ఆ ఫోన్ ను కొత్త ఫోన్‌తో రీప్లేస్ చేస్తారు.

రూ.6999కే మైక్రోమాక్స్ భారీ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్‌

మైక్రోమాక్స్ కాన్వాస్ 1 స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 294 పీపీఐ) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ ఆన్ టాప్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు ( డ్యుయల్ సిమ్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో ఫోన్ జాక్), 2,500mAh బ్యాటరీ. ఫోన్‌లోని అదనపు ఫీచర్లు (మల్టీ విండో సపోర్ట్, క్విక్ సెట్టింగ్స్).

English summary
Micromax Canvas 1 With 2GB RAM and 8MP Primary Camera Launched in India at Rs.6,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot