మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 ప్రీ-బుకింగ్స్ ప్రారంభం!

|

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 ముందస్తు బుకింగ్‌లు నేటి నుంచి ప్రారభమయ్యాయి. సామ్‌స్ంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా రూపొందించబడిన ఈ డివైజ్‌ను వినియోగదారులు రూ.5,000 చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. జూలై 10 నుంచి డెలివరీ ఉంటుంది. ఫోన్ ధరను జూలై 8న అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రీ-బుకింగ్ రుసుముకు సంబంధించి ఎటువంటి ఈఎమ్ఐ సదుపాయం కంపెనీ కల్పించటం లేదు. అయితే మిగిలిన మొత్తాన్ని 3,6,9 లేదా 12 ఈఎమ్ఐలలో చెల్లించవచ్చు. వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లో కాన్వాస్ 4 లభ్యమవుతోంది. ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లను జూలై 8న ఏర్పాటు చేసిన ఫోన్ విడుదల కార్యక్రమంలో మైక్రోమ్యాక్స్ అధికారికంగా వెలువరించనుంది.

 
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4  ప్రీ-బుకింగ్స్ ప్రారంభం!

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు (అంచనా):

5 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
వోక్టా-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునేు సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, 3జీ, ఏ-జీపీఎస్,
2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర అంచనా రూ.17,499 నుంచి రూ.18,499 వరకు.

కాన్వాస్ 4 ముందస్తు బుకింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X