మైక్రోమాక్స్ నుంచి రెండు సరికొత్త కాన్వాస్ స్మార్ట్‌ఫోన్‌లు
భారత్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన కాన్వాస్ సిరీస్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మంగళవారం విపణిలో ఆవిష్కరించింది. కాన్వాస్ బ్లేడ్ హెచ్‌డి (Canvas Blaze HD ), కాన్వాస్ డ్యుయట్ II (Canvas Duet II) వేరియంట్‌లలో రూపుదిద్దుకన్న ఈ హ్యాండ్‌సెట్‌లను మైక్రోమాక్స్ తన అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లోవిక్రయానికి ఉంచింది. కాన్వాస్ బ్లేడ్ హెచ్‌డి ధర రూ.16,000, కాన్వాస్ డ్యుయట్ II ధర రూ.16,000.

మైక్రోమాక్స్ కాన్వాస్ బ్లేడ్ హెచ్‌డి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
డ్యుయల్ సిమ్ (సీడీఎమ్ఏ+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మైక్రోమాక్స్ కాన్వాస్ డ్యుయల్ II కీలక స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే:
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ మీడియాటెక్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








