ఎంటీఎస్ ఉచిత ఆఫర్లతో మైక్రోమాక్స్ కాన్వాస్ బ్లేజ్

Posted By:

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ మైక్రోమాక్స్ , టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఎంటీఎస్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుని జీఎస్ఎమ్ ఇంకా సీడీఎమ్ఏ మొబైల్ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే విధంగా సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ‘కాన్వాస్ బ్లేజ్' పేరుతో ఆవిష్కరించబడిన ఈ హ్యాండ్‌సెట్‌ను బుధవారం నుంచి లభ్యమవుతోంది.

 మైక్రోమాక్స్ నుంచి జీఎస్ఎమ్+ సీడీఎమ్ఏ ఫోన్

ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఎంటీఎస్ 2జీబి ఉచిత డాటాతో పాటు 1000 నిమిషాల (ఎంటీఎస్ నుంచి ఎంటీఎస్)ఉచిత కాలింగ్ ఇంకా 120 నిమిషాల లోకల్ ఇంకా ఎస్టీడీ ఉచిత కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ బండిల్ ఆఫర్లు 6 నెలలు పాటు వర్తిస్తాయి.

మైక్రోమాక్స్ కాన్వాస్ బ్లేజ్ టెక్నికల్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల డిస్‌ప్లే,
డ్యూయల్ కోర్‌క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్ (1గిగాహెట్జ్ క్లాక్ వేగం),
768ఎంబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఇంకా 3జీ కనెక్టువిటీ,
1850ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot