మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 3@ రూ.8,500

|

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన కాన్వాస్ డూడుల్ ఫాబ్లెట్ లైనప్‌ను మరింత విస్తరించే క్రమంలో కాన్వాస్ డూడుల్ 3 (Canvas Doodle 3) పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.8,500. శుక్రవారం నుంచి ఈ డివైస్ మార్కెట్లో లభ్యంకానుంది. ఫాబ్లెట్‌లో ముందుగానే లోడ్ చేసిన బిగ్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ద్వారా 6 నెలల పాటు సినిమాలను అపరిమితంగా వీక్షించవచ్చు.

 
మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 3@ రూ.8,500

కాన్వాస్ డూడుల్ 3 కీలక స్పెసిఫికేషన్‌లు:

6 అంగుళాల డిస్‌ప్లే FWVGA నాణ్యతతో (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిసట్ం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ (ఎంటీ6572) ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్/ జీపీఆర్ఎస్,
జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9 గంటల టాక్‌టైమ్, 260 గంటల స్టాండ్‌బై టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X