హెక్సా కోర్ ప్రాసెసర్‌తో మైక్రోమాక్స్ కాన్వాస్ హైడెఫినిషన్ ఫ్లస్ ఎ190
మైక్రోమాక్స్ తన సరికొత్త హెక్సాకోర్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. కాన్వాస్ హైడెఫినిషన్ ప్లస్ ఎ190 మోడల్‌లో రూపకల్పన చేయబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ Infibeam రూ.13,500కు విక్రయిస్తోంది. బ్లాక్ గోల్డ్ ఇంకా వైట్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. కాన్వాస్ హైడెఫినిషన్ ఫ్లస్ ఎ190 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5 అంగుళాల డిస్‌ప్లే (1280 x 720పిక్సల్ రిసల్యూషన్‌తో),
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6591 హెక్సా కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సదుపాయం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








