హై-ఎండ్ ఫీచర్లతో మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ, రూ.9,999కే

అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌...

|

Micromax Canvas Infinity పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. bezel-less డిజైన్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,999. అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతుంది. సెప్టంబర్ 1 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్నోవేటివ్ ఫీచర్స్‌కు తోడు హై-ఎండ్ కెమెరా, bezel-less డిజైన్‌, 18:9 aspect ratio డిస్‌ప్లే వంటి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి.

 

SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?

డిజైన్ విషయానికి వచ్చేసరికి

డిజైన్ విషయానికి వచ్చేసరికి

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ఫోన్ టాప్ ఇంకా బోటమ్ ఎడ్జెట్ తప్పితే మిగిలిన బాడీ మొత్తం పూర్తి మెటల్‌తో కవర్ అయి ఉంటుంది. బ్రష్షుడ్ మెటల్ ఫినిషింగ్ ఆకట్టుకుంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ 5.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 18:9 aspect ratioని కలిగి ఉండే ఈ డిస్‌ప్లే రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1440 x 720పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేసే వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. వీడియోలను స్ట్రీమ్ చేస్తున్న సమయంలో, గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఈ హైడెఫినిషన్ డిస్‌ప్లే మంచి వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి..
 

కెమెరా విషయానికి వచ్చేసరికి..

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ స్మార్ట్‌ఫోన్‌కు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. రియల్ టైమ్ బోకెహ్ ఎఫెక్ట్, ఆటో సీన్ డిటెక్షన్, 18:9 కెమెరా వంటి స్పెషల్ ఫీచర్స్ ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ కెమెరా f/2.0 apertureను కలిగి ఉంటుంది.

ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే..

ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే..

ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2900mAh బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ ఆన్ ద గో, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

Best Mobiles in India

English summary
Micromax Canvas Infinity launched at Rs.9,999, sale debuts on September 1. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X