మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ ఏ350@రూ.19,999
శక్తివంతమైన ఆక్టా కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థ పై స్పందించే కాన్వాస్ క్నైట్ ఏ350 (Canvas Knight A350) మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ దేశీయ విపణిలోకి బుధవారం తీసుకువచ్చింది. ధర రూ.19,999. ఈ ఆధునిక వర్షన్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ బ్లాక్, వైట్ అండ్, గోల్డ్ అండ్ బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరయింట్‌లలో లభ్యంకానుంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో), అల్యూమినియమ్ బాడీ కేసింగ్, మీడియాటెక్ 2గిగాహెట్జ్ ట్రూ ఆక్టా-కోర్ ఎంటీ6592టీ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఓమ్నీ వర్షన్ కెమెరా చిప్, కొత్త జనరేషన్ ఎమ్8 లార్గాన్ లెన్స్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే... 3జీ హెచ్ఎస్ పీఏ+ఫీచర్, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 2350ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








