16జీబి మెమెరీతో మైక్రోమాక్స్ ‘కాన్వాస్ నిట్రా ఏ311’

Posted By:

16జీబి మెమెరీతో మైక్రోమాక్స్ ‘కాన్వాస్ నిట్రా ఏ311’

మైక్రోమాక్స్ గడిచిన సెప్టంబర్‌లో కాన్వాస్ నిట్రా ఏ310 పేరుతో ఓ మధ్య శ్రేణి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకునటంతో కొనసాగింపుగా 16జీబి ఇంటర్నల్ మెమరీ సామర్థ్యంతో కూడిన కాన్వాస్ నిట్రా ఏ311 స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది. ఈ రెండు  ఫోన్‌లకు మధ్య తేడా కేవలం స్టోరేజ్ మెమరీ మాత్రమే. కాన్వాస్ నిట్రా ఏ310, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. తక్కిన స్పెసిఫికేషన్‌లన్ని రెండు ఫోన్‌లలో ఒక్కటే.

కాన్వాస్ నిట్రా ఏ311 ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 178 డిగ్రీల వీక్షణా కోణంతో, యాంటీ-ఫింగర్ ప్రింట్

వోలియోఫోబిక్ కోటింగ్,
1.7గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
700 మెగాహెట్జ్ మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఐఎమ్ఎక్స్ సీఎమ్ఓఎస్ సెన్సార్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రిటైల్ మార్కెట్లో ఫోన్ అమ్మకాలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ధర వివరాలు వెల్లడికావల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Micromax Canvas Nitro A311 With 16GB Internal Storage Goes Official in India. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot