4000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్@రూ.9,900
‘కాన్వాస్ పవర్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ తాజాగా విడుదల చేసింది. శక్తివంతమైన 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ధర రూ.9,900. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లను మైక్రోమాక్స్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయిస్తున్నారు. బుక్ చేసుకున్న వారికి 7 నుంచి 10 బిజినెస్ దినాలలో డెలివరీ ఉంటుంది. కాన్వాస్ పవర్ ఆవిష్కరణతో మైక్రోమాక్స్, లెనోవో వంటి దిగ్గజ బ్రాండ్‌ల సరసన చేరినట్లయింది. 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై స్పందించే ‘పీ780' మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో జూన్ 2013లో విడుదల చేసిన విషయం తెలిసిందే.

మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications