మైక్రోమాక్స్ కాన్వాస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు త్వరలో ఆండ్రాయిడ్ కిట్‌కాట్ !

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను అందించే ప్రయత్నం చేస్తున్న మైక్రోమాక్స్ తాజాగా మరో నవీకరణకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైక్రోమాక్స్ కాన్వాస్ సిరీస్ నుంచి ఎంపిక చేసిన పలు స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు 2014జనవరి నుంచి ఆండ్రాయిడ్ కిట్ కాట్ అప్‌డేట్‌లు అందనున్నట్లు ఎమ్ఎమ్ఎక్స్ఎన్ న్యూస్‌కాస్టర్ తన అధికారిక ట్విట్టర్అకౌంట్‌లో పేర్కొంది.

 
 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు త్వరలో ఆండ్రాయిడ్ కిట్‌కాట్ !

ఆండ్రాయిడ్ కిట్ కాట్ అప్‌డేట్‌ను అందుకోనున్న మైక్రోమాక్స్ కాన్వాస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఇవే...

A250, A240, A210, A200, A117, A116, A116i, A115, A114, A113, A111, A110Q, A110, A101 , A100.

అయితే, ఈ అప్‌డేట్‌లకు సంబంధించి మైక్రోమాక్స్ వర్గాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ కథనానికి సంబంధించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి తెలుగు గిజ్‌బాట్..

మైక్రోమాక్స్ , ఎంటీఎస్‌ భాగస్వామ్యంతో జీఎస్ఎమ్ ఇంకా సీడీఎమ్ఏ మొబైల్ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే విధంగా సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసారు. ‘కాన్వాస్ బ్లేజ్' పేరుతో ఆవిష్కరించబడిన ఈ హ్యాండ్‌సెట్‌ మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఎంటీఎస్ 2జీబి ఉచిత డాటాతో పాటు 1000 నిమిషాల (ఎంటీఎస్ నుంచి ఎంటీఎస్)ఉచిత కాలింగ్ ఇంకా 120 నిమిషాల లోకల్ ఇంకా ఎస్టీడీ ఉచిత కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ బండిల్ ఆఫర్లు 6 నెలలు పాటు వర్తిస్తాయి.

మైక్రోమాక్స్ కాన్వాస్ బ్లేజ్ టెక్నికల్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ), ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ కోర్‌క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్ (1గిగాహెట్జ్ క్లాక్ వేగం), 768ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఇంకా 3జీ కనెక్టువిటీ, 1850ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.10,794.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X