Home
Mobile

ఆన్‌లైన్ మార్కెట్లోకి మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో మినీ ఏ200

మైక్రోమాక్స్ అభిమానులను గొత కొంత కాలంగా ఉూరిస్తున్న కాన్వాస్ సిరీస్ స్మార్ట్ ఫోన్ ‘టర్బో మినీ ఏ200' ఎట్టకేలకు ఆన్‌లైన్ మార్కెట్లో విడుదలైంది. ప్రముఖ ఈ-కామర్స్ రిటైలర్ Flipkart ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,490కి ఆఫర్ చేస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

ఆన్‌లైన్ మార్కెట్లోకి మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో మినీ ఏ200

4.69 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే...3జీ, వై-ఫై, డ్యుయల్ సిమ్, ఏ-జీపీఎస్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

రష్యా మార్కెట్లో కార్యకలాపాలను ప్రారంభించిన మైక్రోమాక్స్

ప్రపంచవ్యాప్తంగా 11వ అతిపెద్ద మొబైల్ తయారీగా అవతరించిన మైక్రోమాక్స్ మొబైల్స్, రష్యన్ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను గురువారం ప్రారంభించింది. ఈ క్రమంలో రష్యాలోని ప్రముఖ పంపిణీ సంస్థలో ఒకటైన వీవీపీ గ్రూప్స్‌తో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ప్రారంభ దశలో భాగంగా మైక్రోమాక్స్ 14 ఉత్పత్తులను రష్యా మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ఈ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా 60 ఆపరేషనల్ సర్వీస్ సెంటర్లను నెలకొల్పేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటోంది. 2014 చివరినాటికి రష్యాలోని టాప్ మొబైల్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించేందుకు మైక్రోమాక్స్ కృషి చేస్తోంది. ఇండియన్ మార్కెట్ విషయానికొస్తే మైక్రోమాక్స్ రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. స్మార్ట్‌ఫోన్ + ఫీచర్ ఫోన్‌ల విభాగంలో మూడవస్థానంలో మైక్రోమాక్స్ కొనసాగుతోంది.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల విభాగంలో అంతర్జాతీయ బ్రాండ్ సామ్‌సంగ్‌తో పోటిపడుతున్న మైక్రోమాక్స్ జనవరి 6న లాస్‌వేగాస్‌లో నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014లో డ్యుయల్ బూటింగ్ సామర్ధ్యం కలిగిన కాన్వాస్ ల్యాప్‌టాబ్‌ను ఆవిష్కరించింది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ ఇంటెల్ ప్రాసెసర్ పై స్సందిస్తుంది. అలానే రెండు ఆపరేటింగ్ సిస్టంల పై బూట్ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X