విండోస్ ఫోన్‌లను ప్రదర్శించిన మైక్రోమాక్స్

|

ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించిన దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ మొట్టమొదటి సారిగా విండోస్ ఫోన్‌లతో ముందుకొచ్చింది. సోమవారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విండోస్ ఫోన్ 8.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే రెండు సరికొత్త విండోస్ స్మార్ట్‌ఫోన్‌లను మైక్రోమాక్స్ ప్రదర్శించింది.

కాన్వాస్ విన్ డబ్ల్యూ121 ( Canvas Win W121), కాన్వాస్ విన్ డబ్ల్యూ092 (Canvas Win W092) వేరియంట్‌లలో ప్రదర్శించిన ఈ ఫోన్‌ల ధరలను రూ.9,500, రూ.6,500లుగా మైక్రోమాక్స్ ప్రకటించింది. జూలై నుంచి ఈ ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ రెండు ఫోన్‌లలో 1.2గిగాహెట్జ్ సామర్థ్యంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ల‌ను ఏర్పాటు చేసారు. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 1జీబి ర్యామ్‌లను కలిగి ఉంటాయి. డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్‌ను ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి.

కాన్వాస్ విన్ డబ్ల్యూ121 మోడల్ 720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. 8 మెగా పిక్సల్ కెమెరా (ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. ప్రాక్సిమిటీ, గ్రావిటీ, లైట్ సెన్సార్‌లలో నిక్షిప్తం చేసారు.

కాన్వాస్ విన్ డబ్ల్యూ092 మోడల్ స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

విండోస్ ఫోన్‌లను ప్రదర్శించిన మైక్రోమాక్స్

విండోస్ ఫోన్‌లను ప్రదర్శించిన మైక్రోమాక్స్

ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించిన దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ మొట్టమొదటి సారిగా విండోస్ ఫోన్‌లతో ముందుకొచ్చింది. సోమవారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విండోస్ ఫోన్ 8.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే రెండు సరికొత్త విండోస్ స్మార్ట్‌ఫోన్‌లను మైక్రోమాక్స్ ప్రదర్శించింది.

విండోస్ ఫోన్‌లను ప్రదర్శించిన మైక్రోమాక్స్

విండోస్ ఫోన్‌లను ప్రదర్శించిన మైక్రోమాక్స్

కాన్వాస్ విన్ డబ్ల్యూ121 ( Canvas Win W121), కాన్వాస్ విన్ డబ్ల్యూ092 (Canvas Win W092) వేరియంట్‌లలో ప్రదర్శించిన ఈ ఫోన్‌ల ధరలను రూ.9,500, రూ.6,500లుగా మైక్రోమాక్స్ ప్రకటించింది. జూలై నుంచి ఈ  ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభమవుతాయి.

విండోస్ ఫోన్‌లను ప్రదర్శించిన మైక్రోమాక్స్

విండోస్ ఫోన్‌లను ప్రదర్శించిన మైక్రోమాక్స్

ఈ రెండు ఫోన్‌లలో 1.2గిగాహెట్జ్ సామర్థ్యంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ల‌ను ఏర్పాటు చేసారు. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 1జీబి ర్యామ్‌లను కలిగి ఉంటాయి. డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్‌ను ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి.

విండోస్ ఫోన్‌లను ప్రదర్శించిన మైక్రోమాక్స్

విండోస్ ఫోన్‌లను ప్రదర్శించిన మైక్రోమాక్స్

కాన్వాస్ విన్ డబ్ల్యూ121 మోడల్ 720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. 8 మెగా పిక్సల్ కెమెరా (ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. ప్రాక్సిమిటీ, గ్రావిటీ, లైట్ సెన్సార్‌లలో నిక్షిప్తం చేసారు.

కాన్వాస్ విన్ డబ్ల్యూ092 మోడల్ స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X