మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్ఎల్ ఏ119@రూ.13,990

దేశీవాళీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న మైక్రోమాక్స్, కాన్వాస్ ఎక్స్ఎల్ ఏ119 పేరుతో సరికొత్త డ్యుయల్ సిమ్, క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.13,990. డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. ఫోన్ పరిమాణం 165 x84.2x10.4మిల్లీమీటర్లు, బరువు 180 గ్రాములు, 6 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్, 183పీపీఐ, ,960 ×540పిక్సల్స్ రిసల్యూషన్, 2450ఎమ్ఏహెచ్ బ్యాటరీ. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా.....
డ్యుయల్ సిమ్,
6 అంగుళాల ఐపీఎస్ స్కీన్ (రిసల్యూషన్ 960 ×540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4. 2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును మూటగట్టుకున్న మైక్రోమాక్స్ తాజాగా తన బోల్ట్ సిరీస్ నుంచి రెండు ఎంట్రీ స్థాయి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. బోల్ట్ ఏ59, బోల్ట్ ఏ28 శ్రేణిలలో లభ్యమవుతున్న ఈ ఫోన్‌లను మైక్రోమాక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మైక్రోమాక్స్ ఏ59 మార్కెట్ ధర రూ.4,499 కాగా బోల్టో ఏ28 హ్యాండ్‌సెట్ ధర రూ.3,599.
మైక్రోమాక్స్ బోల్ట్ ఏ59 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. 3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ద్యం 320×480పిక్సల్స్), 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ఎస్‌సీ7710 ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, 2జీ, వై-ఫై, బ్లూటూత్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మైక్రోమాక్స్ బోల్ట్ ఏ28 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, కనెకన్టువిటీ ఫీచర్లు 2జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








