మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్ఎల్2 ఎ109@రూ.10,999
కొద్ది రోజుల క్రితం మైక్రోమాక్స్ తన అధికారిక వెబ్‌సైట్ లిస్టింగ్స్‌లో పేర్కొన్న లేటెస్ట్ వర్షన్ ‘కాన్వాస్ ఎక్స్ఎల్2 ఎ109' (Canvas XL2 A109) స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో అధికారికంగా లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ ఇన్ఫీబీమ్ (Infibeam) ఆ మధ్య ముగింపు ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌ను రూ.10,999కి విక్రయిస్తోంది.

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్ఎల్2 ఎ109 కీలక స్పెసిఫికేషన్‌లు:
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
5.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్960× 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఏ2డీపీ, జీపీఎస్, ఏజీపీఎస్),
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








