త్వరలో మైక్రోమాక్స్ స్మార్ట్‌వాచ్..?

Posted By:

త్వరలో మైక్రోమాక్స్ స్మార్ట్‌వాచ్..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ తరువాతి అడుగలో భాగంగా స్మార్ట్‌వాచ్‌లను తయారు చేయటం ప్రారంభించాయి. ముఖ్యంగా సోనీ, సామ్‌సంగ్ వంటి కంపెనీలు తమ  స్మార్ట్‌వాచ్‌లను ఇప్పటికే మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చాయి. యాపిల్, నోకియా వంటి ప్రముఖ కంపెనీలు సైతం స్మార్ట్‌వాచ్‌ల తయారీ దృష్టిసారిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ త్వరలో స్మార్ట్‌వాచ్‌ల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

వేరబుల్ పరికాల విభాగంలోకి మైక్రోమాక్స్ అరంగ్రేటానికి సంబంధించిన ఈ ఆసక్తికర సమచారాన్ని కంపెనీకి కొత్త చైర్మన్‌గా నియామకమైన సంజయ్ కపూర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ స్మార్ట్ వేరబుల్ పరికరానికి సంబంధించిన వివరాలు త్వరలోనే పూర్తిగా వెల్లడయ్యే అవకాశముంది. మైక్రోమాక్స్ ఇప్పటికే తమ వ్యాపార కార్యకలాపాలను రష్యా మార్కెట్‌కు విస్తరించింది. మరోవైపు 4జీ స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పైనా మైక్రోమాక్స్ దృష్టిసారించిన విషయం తెలిసిందే.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot