రూ.9999కే మైక్రోమాక్స్ డ్యుయల్ కెమెరా ఫోన్, 4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్
ఆగష్టు 21 అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా సేల్ ప్రారంభం..
మైక్రోమాక్స్ తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ Evok Dual Noteను శుక్రవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ ఆగష్టు 21 అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభమవుతుంది. మొత్తం రెండు
వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

వాటి వివరాలు.. 3జీబి ర్యామ్ విత్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబి ర్యామ్ విత్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్. ప్రారంభ వేరియంట్ ధర రూ.9,999. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై ఐడియా యూజర్లకు, రూ.443కే 3 నెలల వ్యాలిడిటీతో 84జీబి 4జీ డేటాతో అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. మరో ఆఫర్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోదలిచినట్లయితే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ క్రింద రూ.11,000 వరకు లభిస్తుంది. EMI స్కీమ్స్ పై కూడా ఈ ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు.
మైక్రోమాక్స్ ఇవోక్ డ్యుయల్ నోట్ స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ (13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్) విత్ సోనీ ఐఎమ్ఎక్స్258 సెన్సార్ అండ్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ సాఫ్ట్ సెల్ఫీ ఫ్లాష్, 3000mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్ (హైబ్రీడ్).


Click it and Unblock the Notifications








