మైక్రోమాక్స్ Evok Note ఆన్‌లైన్ రేసులో నిలబడిందా..? (రివ్యూ)

ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో డీసెంట్ మార్కెట్ షేర్‌ను కలిగి ఉన్న మైక్రోమాక్స్, చైనా బ్రాండ్ లకు పోటీగా వరస పెట్టి కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఆఫ్‌లైన్ మార్కెట్లో ఇప్పటికే మంచి పట్టును సంపాదించిన మైక్రోమాక్స్ ఇటు ఆన్‌లైన్ మార్కెట్లోనూ తన దూకుడును పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆన్‌లైన్ మార్కెట్‌ను ఉద్దేశించి మైక్రోమాక్స్ లాంచ్ చేసిన యుటెలీవెంచర్స్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోవటంతో, యు ప్రొడక్ట్ లైనప్‌ను త్వరలోనే నిలిపివేయబోతోన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

"Evok" సిరీస్‌

తాజాగా ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మైక్రోమాక్స్ తన "Evok" సిరీస్‌తో ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. షియోమి, లెనోవో, హువావే హానర్, ఒప్పో, వివో వంటి బ్రాండ్‌లకు పోటీగా మైక్రోమాక్స్ తీసుకువచ్చిన Evok బ్రాండ్ ఫోన్‌లు కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే దొరుకుతుతాయి.

 

Evok Note, Evok Power

తాజాగా Evok సిరీస్ నుంచి Evok Note, Evok Power పేర్లతో రెండు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. రూ.10,000 ధర  రేంజ్‌లో రూపొందించిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు అటు హార్డ్‌వేర్ పరంగా ఇటు సాఫ్ట్‌వేర్ పరంగా ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉన్నాయి.

రెడ్మీ నోట్ 4 ఫోన్‌కు డైరెక్ట్ కాంపిటీటర్‌

ఈ రెండు ఫోన్‌లలో ఒకటైన Evok Noteను రెడ్మీ నోట్ 4 ఫోన్‌కు డైరెక్ట్ కాంపిటీటర్‌గా మైక్రమాక్స్ భావిస్తోంది. మరీ ఈ ఫోన్‌లో అంత దమ్ముందా..? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

డిజైన్ పరంగా చూస్తే..

డిజైనింగ్ పరంగా చూస్తే మైక్రోమాక్స్ Evok Note చైనా స్మార్ట్‌ఫోన్‌లకు దగ్గర పోలికలను కలిగి ఉంది. ఈ ఫోన్ డిజైనింగ్ విషయంలో హువావే, షియోమి బ్రాండ్‌లను అనుసరించినట్లు తెలుస్తోంది. ఫోన్ రేర్ ప్యానల్ పై కనిపించే బ్రష్షుడ్ మెటల్ ఫినిష్ హానర్ 5ఎక్స్‌ను గుర్తు చేస్తుంది. ఫోన్ కెమెరా మాడ్యుల్, ఫ్లాష్ లైట్, లోగో వంటి అంశాలను రెడ్మీ నోట్ 3 ప్రేరణతో తీసుకున్నట్లు అనిపిస్తుంది.

లైట్ వెయిట్ ఫోన్..

కాంపాజిట్ మెటల్‌తో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ బరువు విషయంలో కంఫర్ట్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఫోన్ వెనుక భాగం మెటల్‌తోనూ, కార్నర్ భాగాలను ప్లాస్టిక్ తోనూ తీర్చిదిద్దారు. పవర్ బటన్ అలానే వాల్యుమ్ రాకర్స్ రైట్ సైడ్‌లో ఉంటాయి. హైబ్రీడ్ సిమ్ స్లాట్‌ను ఫోన్ లైఫ్ట్ సైడ్ భాగంలో ఏర్పాటు చేసారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఫోన్ పై భాగంలో, మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఫోన్ బోటమ్‌లో ఉంటుంది.

2.5కర్వుడ్ గ్లాస్, ఎంబెడెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్

ఫోన్ డిస్‌ప్లేను 2.5కర్వుడ్ గ్లాస్ పూర్తిగా కవర్ చేస్తుంది. ఈ గ్లాస్ కవరింగ్ ఫోన్ ముందు భాగానికి ప్రీమియమ్ లుక్‌ను అద్దింది. డిస్‌ప్లే క్రింది భాగంలో అమర్చిన హోమ్‌బటన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఫిట్ చేయటంతో హ్యాండ్‌సెట్‌కు అదనపు సెక్యూరిటీ లభించినట్లయింది. ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫోన్‌ను లాక్ చేయటమే కాకుండా అనేక విధంగా పనులను చక్కబెట్టుకునేందుకు కస్టమైజ్ చేసుకోవచ్చు.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

 Evok Note 5.5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ ను కలిగి ఉంటుంది. ఈ 1080 పిక్సల్ డిస్ ప్లేకు 2.5డి కర్వుడ్ గ్లాస్ కూడా తోడవటంతో ఫోన్ మరింత ప్రీమియమ్ లుక్‌ను సుతరించుకుని ఉంటుంది. 400 పీపీఐతో వస్తోన్న ఈ డిస్‌ప్లేలో కలర్ రీప్రొడక్షన్ మాత్రం డల్‌గా అనిపిస్తుంది.

 

హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే..

Evok Note ఫోన్ మీడియాటెక్ MT6753 ఆక్టా-కోర్ చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు జత చేసిన 3జీబి ర్యామ్ యావరేజ్ మల్టీటాస్కింగ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, కెమెరా యాప్‌ను ఎక్కువు సేపు వాడుతున్నప్పడు మాత్రం ఫోన్ పనితీరు నెమ్మదిస్తోంది. హైవీ గేమ్స్ ఆడుతున్న సమయంలో ఇదే సమస్య పనురావృతమవుతోంది.

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి

Evok Note ఫోన్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని మరింతగా విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. బ్లుటూత్, వై-ఫై, డ్యుయల్ సిమ్, VoLTE వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

 

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

Evok Note ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై బూట్ అవుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంతో పాటుగా లోడ్ చేసిన 'Android on Steroids' (AOS) లాంచర్ అనేక ప్రీలోడెడ్ యాప్స్‌ను కలిగి ఉంటుంది. వీటిని మీరు వద్దనుకుంటే uninstall చేసేసుకోవచ్చు.

అదనపు ప్రత్యేకతలు..

ఈ ఫోన్‌తో మైక్రోమాక్స్ అందిస్తోన్న 'Around' కంటెంట్ అగ్రిగేటర్ సర్వీస్ అలానే సెక్యూర్ వాల్ట్ ఫీచర్లు ఆకట్టుకుంటాయి. అరౌండ్ యాప్ సర్వీస్ ద్వారా మూవీ టికెట్స్, క్యాబ్ బుకింగ్ తో పాటు సమీపంలో రెస్టారెంట్స్ డేటాను తెలుసుకునే వీలుంటుంది. సెక్యూర్ వాల్ట్ ఫీచర్ ద్వారా ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను ఎన్ క్రిప్ట్ చేసుకునే వీలుంటుంది.

కెమెరా పనితీరు విషయానికొస్తే...

Evok Note ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. స్మైల్ డిటెక్షన్, హెచ్‌డీఆర్, గెస్ట్యుర్ క్యాప్చుర్, పానోరమా వంటి 9 రకాల ఫిల్టర్లను ఫోన్ రేర్ కెమెరాలో చూడొచ్చు. ఆటో, నైట్, సన్ సెట్, పార్టీ, పోర్ట్రెయిట్, థియేటర్, బీచ్ వంటి సీన్ మోడ్స్ కూడా ఈ కెమెరాలో ఉన్నాయి.

 

కెమెరా పనితీరు ఎలా ఉందంటే..?

కెమెరాలోని HDR modeను యాక్టివేట్ చేసినప్పుడు కెమెరా పనితీరు నెమ్మదిస్తోంది. ఇక ఇమేజ్ క్వాలిటీ విషయానికొస్తే డేలైట్ కండీషన్ లలో చిత్రీకరించే ఫోటోలకు సంబంధించి కలర్ కాంట్రాస్ట్ ఇంకా డిటైలింగ్ బాగుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కెమెరా పనితీరు అంతగా ఆకట్టుకునే విధంగా లేదు.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మైక్రోమాక్స్ Evok Note ఫోన్ శక్తివంతమైన 4,000 mAh బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్ పై ఫోన్‌ను రోజు మొత్తం ఉపయోగించుకోవచ్చు.

తుది నిర్ణయం...

పేరుకు తగ్గట్టుగా Evok Note స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంది. అయితే, రియల్ టైమ్‌లో వీటి పనితీరు మాత్రం అంతగా ఆకట్టుకునేలా లేదు. యావరేజ్ క్వాలిటీ ప్రాసెసింగ్ స్పీడ్, మధ్యస్థాయి కెమెరా, నెమ్మదైన సాఫ్ట్‌వేర్ పనితీరుతో ఈ ఫోన్ ఆన్‌లైన్‌ రేస్‌లో వెనుకబడిందినే చెప్పొచ్చు. అయితే, రాబోయే Evok series ఫోన్‌లలో ఈ చిన్నచిన్న లోపాలు పునరావృతం కాకూడదని ఆశిద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Evok Note review: A good attempt but not a winner in sub 10k price-point. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot