మాల్దీవులలో ప్రత్యక్షం కానున్న మైక్రోమ్యాక్స్ మొబైల్స్

Posted By: Super

మాల్దీవులలో ప్రత్యక్షం కానున్న మైక్రోమ్యాక్స్ మొబైల్స్

ఇండియన్ మొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని స్దానాన్ని సంపాదించుకున్న దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ త్వరలో తన కార్యకలాపాలను విస్తరించనుంది. 2008వ సంవత్సరంలో ప్రారంభమైన మైక్రోమ్యాక్స్ మొబైల్స్ ప్రస్తుతం ఇండియన్ మొబైల్ మార్కెట్లో మూడవ అతి పెద్ద మొబైల్ కంపెనీగా అవతరించింది. ఇంతటితో ఆగకుండా మైక్రోమ్యాక్స్ మొబైల్స్ తన బిజినెస్‌ను విసృత పరచుకునే దిశగా కదిలింది. అందులో భాగంగా మైక్రోమ్యాక్స్ మొదట దశగా మాల్దీవులలో అమ్మకాలను ప్రారంభించింది.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్‌ని వ్యాపింపచేసేందుకు భాగంలో మొదటగా మాల్టీవులలో కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతోపాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా ప్రవేశించింది. మాల్దీవులలోని లీడింగ్ మొబైల్ డిస్ట్రిబ్యూటర్‌తో కలసి మైక్రోమ్యాక్స్‌కి సంబంధించిన పది లెటేస్ట్ కొత్త మోడల్స్‌ని మాల్దీవుల మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. మైక్రోమ్యాక్స్ మాల్టీవులలో భాగస్వామ్యం కలిసినటువంటి సెన్స్‌వుడ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాల్దీవులలో పాగా వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల మైక్రో మ్యాక్స్‌కి లాభిస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్బంలో మైక్రో మ్యాక్స్ జనరల్ మేనేజర్ వికాస్ సన్హి మాట్లాడుతూ మాల్దీవులలో ఉన్న ప్రజలకు నాణ్యమైన కమ్యూనికేషన్ అందించే భాగంలో ఉత్తమమైన మైక్రోమ్యాక్స్ మొబైల్స్‌ని అందించడం మాకు చాలా గర్వంగా ఉందని అన్నారు. మైక్రోమ్యాక్స్ హ్యాండ్ సెట్స్ గనుక తీసుకున్నట్లైతే చాలా వరకు డ్యూయల్ సిమ్స్‌ని ఆఫర్ చేసేటటువంటి మొబైల్స్ ఎక్కువ. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు టచ్ స్క్రీన్ ఫెసిలిటీస్ కలిగినటువంటి మొబైల్స్ సుమారుగా పది వరకు ఉన్నాయని ఆ పది మొబైల్స్‌ని మాల్టీవులలో విడుద చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

రాబోయే కాలంలో మాల్టీవుల టెలికామ్ సెక్టార్‌లో హై క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్‌ని కూడా ప్రవేశపెట్టనున్నామని అన్నారు. మైక్రో మ్యాక్స్ రీసెర్ట్ డెవలప్ మెంట్ టీమ్ చెప్పిన దానిప్రకారం మైక్రోమ్యాక్స్ హ్యాండ్ సెట్స్‌కి మంచి గిరాకీ తప్పనిసరిగా లభిస్తుందని మంచి మార్కెట్‌ని సొంతం చేసుకోవడం జరగుతుందని తెలిపారు. మొబైల్స్‌తో పాటు మైక్రోమ్యాక్స్ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్స్‌ని కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. మైక్రోమ్యాక్స్ మాల్టీవుల మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న మొబైల్స్ ధరలు 425 మాల్దీవుల రూపియా నుండి 4,500 మాల్దీవుల రూపియా వరకు ఉండబోతున్నాయని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot