దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ కంపెనీ పై మైక్రోమాక్స్ కన్ను!

Posted By:

భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ దక్షిణ కొరియాకు చెందిన పాంటెక్ కంపెనీలో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వెబ్ మీడియాలో వార్తల వినిపిస్తున్నాయి. తమ వ్యాపారాలను ఇతర దేశాల్లో విస్తరించేందుకు వీలుగా మైక్రోమాక్స్ ఈ డీల్‌కు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

 దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ కంపెనీ పై మైక్రోమాక్స్ కన్ను!

కాగా, దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పాన్‌టెక్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. మార్కెట్లో సామ్‌సంగ్, ఎల్‌జి వంటి కంపెనీలతో నెలకున్న పోటీ కారణంగా పాన్‌టెక్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ పరిణామాల నేపధ్యంలో గత కొన్ని త్రైమాసికాల కాలంగా పాంటెక్ నష్టాలను ప్రకటిస్తూ వస్తోంది. పాంటెక్ కంపెనీలో మైక్రోమాక్స్ ఎంత మేర వాటాను కొనుగోలు చేయనుంది ఆ విలువ ఎంత తదితర వివరాలకు సంబంధించి వివరాలు వెల్లడికావల్సి ఉంది. పాన్‌టెక్ కంపెనీలో 9 రుణదాత కంపెనీలు సంయుక్తంగా 37శాతం వాటాను కలిగి ఉన్నాయి. క్వాల్కమ్‌కు12 శాతం, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు10 శాతం వాటాలు ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot