మైక్రోమాక్స్ ఫన్‌బుక్ పీ280@రూ.4650
చవక ధర పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తూ ప్రముఖ దేశవాళీ ట్యాబ్లెట్ పీసీల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన ఫన్‌బుక్ సిరీస్ నుంచి ఫన్‌బుక్ పీ280 ( Funbook P280) పేరుతో సరికొత్త ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లో ఆశిష్కరించింది. ధర రూ.4,650. 7 అంగుళాల తాకేతెరను కలిగి ఉండే ఈ డివైస్ ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్ పై ట్యాబ్ రన్ అవుతుంది. 0.3 మెగా పిక్సల్ సామర్థ్యం గల ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, M!Live, స్పుల్, ఒపెరా మినీ, కింగ్‌సాఫ్ట్ ఆపీస్ సూట్ వంటి అప్లికేషన్‌లను ట్యాబ్‌లో ముందస్తుగా లోడ్ చేసారు.

మైక్రోమాక్స్ ఫన్‌బుక్ పీ280 కీలక స్పెసిఫికేషన్‌లు:
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ సింగిలో కోర్ ఏ13 ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,
3జీ వయా యూఎస్బీ డాంగిల్,
వై-ఫై, యూఎస్బీ 2.0,
2400ఎమ్ఏహెచ్ బ్యాటరీ (250 గంటల స్టాండ్‌బై టైమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications