Micromax In Note 1 మొదటి సేల్ రేపటి నుంచి ప్రారంభం!!!

|

'మేక్ ఇన్ ఇండియా' చొరవలో భాగంగా భారతీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మైక్రోమాక్స్ సంస్థ ఇటీవల ఇండియాలో కొత్తగా "ఇన్" సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్‌లోని మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ మొదటిసారిగా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. మీడియాటెక్ చిప్‌సెట్‌లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో రన్ అవుతూ అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కలిగి ఉన్న మైక్రోమాక్స్ కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

మైక్రోమాక్స్ సంస్థ ఇటీవల మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో ఫోన్ యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.10,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.12,499. ఇది గ్రీన్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని రేపటి నుంచే అంటే నవంబర్ 24 నుండి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది.

Also Read: Micromax In Note 1 First Sale Starts Tomorrow in India: Price, Specs, OffersAlso Read: Micromax In Note 1 First Sale Starts Tomorrow in India: Price, Specs, Offers

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్పెసిఫికేషన్స్
 

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్పెసిఫికేషన్స్

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేను పంచ్-హోల్ డిజైన్‌ నిర్మాణంతో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G85 SoCను కలిగి ఉండి 4GB RAMతో జతచేయబడి ఉంటుంది. అలాగే రాబోయే రెండు సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కూడా అందించనున్నట్లు కూడా సంస్థ వాగ్దానం చేసింది.

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ కెమెరా సెటప్

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ కెమెరా సెటప్

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంది. మాక్రో షాట్లు మరియు డీప్ సెన్సింగ్ కోసం రెండు 2-మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇంకా కెమెరా సెటప్ LED ఫ్లాష్‌తో జత చేయబడి వస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మద్దతు గల ఫీచర్లతో పనిచేస్తుంది.  అలాగే సెల్ఫీల కోసం ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంది. ఇది 78 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీ కెమెరా సాధారణ ఫోటోలు మరియు వీడియోలతో పాటు GIF లను కూడా షూట్ చేయగలదు.

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 18W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 18W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1యొక్క మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరిని 128GB వరకు విస్తరించడానికి అనుమతిని కూడా ఇస్తుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చబడి ఉంటుంది. అంతేకాకుండా ఇది రివర్స్ ఛార్జింగ్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతును ఇచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Micromax In Note 1 First Sale Starts Tomorrow in India: Price, Specs, Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X