రూపాయికే స్మార్ట్‌ఫోన్, సవాల్ విసురుతున్న దేశీయ దిగ్గజం !

దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది. అత్యంత చౌకగా కేవలం రూపాయికే స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేస్తానంటూ టీజ్‌ చేస్తోంది.

|

దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది. అత్యంత చౌకగా కేవలం రూపాయికే స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేస్తానంటూ టీజ్‌ చేస్తోంది. సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేయనున్నామని దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్‌ చెబుతోంది. అత్యంత తక్కువగా రూపాయికే కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేస్తామంటూ కంపెనీ టీజర్‌ కూడా విడుదల చేసింది. లేదా ఉచితంగానైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జూలై 5న కంపెనీ ఈ టీజర్‌ను షేర్‌చేసింది. అయితే ఇది రింగింగ్‌ బెల్స్‌ సంస్థ ఫ్రీడం 251 ఫోన్ లాగానే తయారవుతుందా లేక సంచలనం సృష్టిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

అసుస్ దెబ్బ, వన్‌ప్లస్ 6పై భారీ తగ్గింపుఅసుస్ దెబ్బ, వన్‌ప్లస్ 6పై భారీ తగ్గింపు

రూపాయికే మేము స్మార్ట్‌ఫోన్‌..

రూపాయికే మేము స్మార్ట్‌ఫోన్‌..

‘హలో చెన్నై! బిగ్‌ న్యూస్‌ రూపాయికే మేము స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటిస్తున్నాం - ఆర్‌ యూ రెడీ? అంటూ.. మైక్రోమ్యాక్స్ టీజ్‌ చేసింది అంటే వచ్చే వారాల్లోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ చెన్నై వాసుల ముందుకు తీసుకురాబోతుందని తెలుస్తోంది.

జియోఫోన్‌ మాదిరి..

జియోఫోన్‌ మాదిరి..

అయితే ఈ ఆఫర్‌ జియోఫోన్‌ మాదిరి ఉండొచ్చని టెక్‌ వర్గాలంటున్నాయి. జియోఫోన్‌ కూడా పూర్తిగా జీరోకే కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

డిపాజిట్‌ కింద 1500 రూపాయలు

డిపాజిట్‌ కింద 1500 రూపాయలు

కానీ తొలుత ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు సెక్యురిటీ డిపాజిట్‌ కింద 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ అనంతరం ఆ మొత్తాన్ని రిలయన్స్‌ జియో రీఫండ్‌ చేయనుంది.

 ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ..?

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ..?

అదే మాదిరి ఈ కంపెనీ కూడా రూపాయికే మైక్రోమ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్‌ చేస్తుందని అంటున్నారు. అయితే యూజర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ పొందడం కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందని, ఆ అనంతరం ఆ మొత్తాన్ని టెలికాం ప్రొవైడర్లతో లింక్‌ అయి డేటా, వాయిస్‌ కాల్స్‌ రూపంలో అందిస్తుందని చెబుతున్నారు.

 నిజంగానే లాంచ్‌ చేసి

నిజంగానే లాంచ్‌ చేసి

లేదా రూపాయికే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను నిజంగానే లాంచ్‌ చేసి, లిమిటెడ్‌ మొత్తంలో మార్కెట్‌లోకి అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది.

మరికొన్ని రోజులు ఆగాల్సిందే

మరికొన్ని రోజులు ఆగాల్సిందే

అయితే ఏ విధంగా రూపాయికి స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని టెక్‌ వర్గాలు అంటున్నాయి.

Micromax టీజర్

Micromax రిలీజ్ చేసిన వీడియో ఇదే 

Best Mobiles in India

English summary
Micromax India to launch a smartphone for just Rs 1 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X