కేవలం ఆడవారిని దృష్టిలో పెట్టుకొని: మైక్పోమ్యాక్స్ మ్యాక్స్ విస్తా, బ్లింగ్2

By Super
|
Maxx Vista
చాలా సంవత్సరాలుగా మొబైల్స్ గనుక చూసుకున్నట్లైతే కేవలం మగవారు వాడే విధంగా మాత్రమే తయారు చేసేవారు. రాబోయే కాలంలో మొబైల్స్ ఆడవారు కూడా ఉపయోగిస్తుండండతో ప్రత్యేకంగా అడవారి కోసం మొబైల్స్ తయారు చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం మార్కెట్‌లో కస్టమర్స్ యొక్క అభిరుచులకు తగ్గట్లు మొబైల్స్‌‌ని తయారు చేస్తున్నారు. మొబైల్ తయారీదారులు కస్టమర్స్‌లో ఆడవారు కూడా ఉండారు కాబట్టి వారి కోసం కూడా ప్రత్యేకంగా మంచి మంచి స్టైలిష్ మోడల్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు.

ఆడవారికే అందం తెచ్చేటటువంటి మొబైల్స్ మోడల్స్‌ని మైక్రోమ్యాక్స్ ప్రత్యేకంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆ రెండు మోడళ్లు మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 2, మైక్రోమ్యాక్స్ మ్యాక్స్ విస్తా. ఈ రెండు మోడళ్లు‌‌‌‌ని మార్కెట్లోకి దించడం వెనుక మైక్రోమ్యాక్స్ వెలువరించిన మతలబు ఏంటంటే ఆడవారికి ఈ మొబైల్స్‌ ని ఫేవరేట్ చేయడమని తెలిపారు. ఈ మొబైల్స్ రెండు కూడా మగవారి చేతిలో ఉండడం కంటే కూడా ఆడవారి చేతిలో ఉంటే మరింత కాంతిని సంతరించుకుంటాయని అన్నారు.

ఇక మైక్రోమ్యాక్స్ విస్తా విషయానికి వస్తే డూయల్ సిమ్ పెట్టుకునేటటువంటి కెపాసిటీని కలిగిఉండి, పింక్, వైట్ కలర్ కాంబినేషన్‌లో ఆడవారికి నచ్చేవిధంగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే మైక్రోమ్యాక్స్ విస్తా 3.2మెగా ఫిక్సల్ సామర్ద్యంతో, విస్తరించుకోదగిన మొమొరి స్లాట్ 8జిబి వరకు సపోర్టు చేస్తుంది. దీనితో పాటు మైక్రోమ్యాక్స్ విస్తా జావా ని కూడా సపోర్టు చేస్తూ సోషల్ నెట్ వర్కింగ్‌ని యాక్సెస్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా కీస్ ఉన్నాయి. బ్లూటూత్, యుఎస్‌బి లాంటి వాటిని కూడా సపోర్టు చేస్తుంది. ఇక బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే ఎక్కువ కాలం మన్నేటటువంటి బ్యాటరీ, మీకు నచ్చినటువంటి సాంగ్స్‌ని చాలా క్లియర్‌గా వినడానికి కూడా ఇది దోహాదపడుతుంది. వీటితోపాటూ 3.5mm జాక్ ఉంది. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే కేవలం రూ 4242.

ఇక మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 2 ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. మొబైల్స్‌పై మోజు ఎక్కువ ఉన్న ఆడవారిని దృష్టిలో పెట్టుకోని ఈ మొబైల్ రూపోందించడం జరిగింది. మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 2 ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ చూడడానికి సింపుల్ స్టయిల్‌లో ఉంటుంది. మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 2 ఫీచర్స్ గనుక చూసుకున్నట్లైతే 2మెగా ఫిక్సల్ కెమెరా, బ్లూటూత్, విస్తరించదగిన మొమొరి, జిపిఆర్‌ఎస్ మొదలగునవి ఉన్నాయి. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే కేవలం రూ 8000మాత్రమే.

మైక్రోమ్యాక్స్ మ్యాక్స్ విస్తా, మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 2 రెండిండిని గనుక చూసినట్లేతే మొబైల్ మార్కెట్‌లో ఆడవారి కోసం ఓ విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి దోహాద పడడంలో సందేహాం లేదు. ఫీమేల్ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని రాబోయే కాలంలో మరిన్ని మోడళ్లు మార్కెట్‌లో వీటికి పోటీగా వస్తాయనడంలో ఎటువంటి సందేహాం లేదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X